అయితే కరోనా తీవ్రత ఇపుడు బాగా తగ్గిందని పెద్దగా ప్రభావం ఉండటం లేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభావం పెద్దగా ఉండబోదని వారు అంటున్నారు. అయితే నిర్లక్ష్యం విపత్తుకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందు జాగ్రత్తే శ్రీ రామ రక్ష అంటున్నారు. ఎందుకంటే పలు దేశాల్లో మళ్ళీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ వ్యాప్తి వేగం పుంజుకుంది. ఇది ఇతర దేశాలకు కూడా పాకే అవకాశం ఉందన్న విషయం గతంలో అనుభవమే. అందుకే కరోనా జాగ్రత్తలు, సూచనలు తప్పక పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని వారు వేసుకోవాలని అలాగే బూస్టర్ డోసు లను కూడా సదరు ప్రజలు వేసుకుని సురక్షితంగా వుండాలని కోరుతున్నారు. ముప్పతిప్పలు పెట్టి ఎందరో ప్రజల ప్రాణాలను బలిగొన్న ఈ మాయదారి వైరస్ ఎప్పటికి శాంతించి పూర్తిగా ఈ భూమిని విడిచి వెళుతుంది తెలియడం లేదు. ఈ విషయం మహా మహా శాస్త్రవేత్తలకు సైతం అంతుపట్టడం లేదు. మరి ముందు ముందు ఏమి జరుగుతుందో తెలియదు. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనము ఉండడం మంచిది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి