ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించినా భారత్ చైనా పై మాత్రం యుద్ధం ప్రకటించింది. అయితే ఆయుధ యుద్ధం కాదు ఆర్థిక యుద్ధం చేస్తూ చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అన్ని రకాల యాప్స్ నిషేధించింది. అంతేకాకుండా ఈ చైనా నుంచి దిగుమతులను ఒక్కొక్కటిగా నిషేధం విధిస్తూ వస్తుంది. ఇక ఇలా చైనా నుండి భారత్ దిగుమతి అయ్యే వాటిలో ఎక్కువగా బొమ్మలు ఉన్నాయి అని చెప్పాలి. చైనా నుంచి చీప్ అండ్ బెస్ట్ గా బొమ్మలు భారత్ దిగుమతి అవుతూ ఉంటాయి.
ఈ క్రమంలోనే ఇక చైనా నుంచి దిగుమతి అయ్యే బొమ్మల పై భారీ టాక్స్ విధించిన భారత ఒక రకంగా నిషేధించినంత పని చేసింది. అదే సమయంలో స్వదేశీ బొమ్మలను తయారు చేసేందుకు ప్రోత్సాహకాలు అందించింది. దీంతో ఒకప్పటితో పోలిస్తే భారత్ తో బొమ్మల తయారీ భారీగా పెరిగిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత్ ఆంక్షల కారణంగా చైనా ఎన్నో వందల కోట్లు నష్టపోయింది అన్న విషయాన్ని ఇటీవల చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. చైనా భారత్ మధ్య బొమ్మలకు సంబంధించి 452 మిలియన్ డాలర్ల బిజినెస్ కాస్త 216 మిలియన్ డాలర్లకు పడిపోయింది అన్న విషయాన్ని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి