నిన్న మొన్నటి దాకా ఎండల తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు చల్లని కబురు..మన దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చేశాయి. మాన్‌సూన్‌ రాకతో ఏపీ, తెలంగాణలో తొలకరి వర్షాలు మొదలైపోయాయి.. రానున్న రెండు,మూడు రోజులలో తెలుగు స్టేట్స్‌ మొత్తం జోరువానలు దంచికొట్టబోతున్నాయ్‌. కాస్త లేట్ అయినా, మరింత ఆలస్యం లేకుండా తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాయ్‌ నైరుతి రుతుపవనాలు. రావడం రావడమే వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. మాన్‌సూన్‌ మబ్బులతో సూర్యుడ్ని కమ్మేసి, వెదర్‌ను ఆహ్లాదకరంగా చేసేశాయ్ నైరుతి రుతుపవనాలు..


గడువు కంటే ముందే మాన్‌సూన్‌ దేశంలోకి ఎంట్రీ ఇచ్చినా, విస్తరించేందుకు మాత్రం టైమ్‌ తీసుకున్నాయ్‌. మే 15 నాటికే మాన్‌సూన్‌ అండమాన్‌ను తాకింది. కానీ, మందగమనంతో అక్కడే ఆగిపోయాయి. IMD లెక్క ప్రకారం జూన్‌ ఫస్ట్‌ వీక్‌లోనే ఏపీ, తెలంగాణలోకి నైరుతి వర్ష మేఘాలు ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా, వారం పది రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి...వీటి వల్ల రాష్టాలలో వాతావరణం చల్లబడుతుంది..దీని వల్ల రైతులకు సంతోషంగా ఉంటుంది. తెలుగు నైరుతి మబ్బులు కమ్మేశాయి. అనేక ప్రాంతాల్లో తొలకరి జల్లులు సైతం కురిశాయి. దాంతో, వేసవి వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు జనం. మాన్‌సూన్‌ ప్రభావంతో తెలంగాణ అంతటా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. మూడ్రోజులపాటు జోరువానలు పడతాయని తెలిపింది. ప్రజెంట్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా వరకు విస్తరించిన నైరుతి వర్ష మేఘాలు, ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయ్‌.



ఏపీలో రాయలసీమతోపాటు కోస్తాంధ్రలో నైరుతి మేఘాలు విస్తరించాయ్‌. దాంతో, రాబోయే మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఐదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించి, ఉరుములు మెరుపులతో హెవీ రెయిన్స్‌ పడతాయంటున్నారు అధికారులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా, పూర్తిగా విస్తరించడానికి మూడు నాలుగు రోజులు పడుతుందంటున్నారు. మాన్‌సూన్‌తోపాటు ఉపరితల ద్రోణి కూడా ఆవరించి ఉండటంతో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో జోరుగా గాలివానలు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: