ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తీరని అవమానం జరిగిందట. రాజకీయ జీవితం చివరిదశలో జరిగిన అవమానం అంటే నిజంగా బాధకరమనే చెప్పాలి. కానీ వెంకయ్యకు జరిగింది నిజంగానే అవమానమేనా ? ఎవరివల్ల జరిగింది ? ఎవరు బాధ్యులు ? అనేది ఇక్కడ కీలకమైన పాయింట్. తన ప్రత్యర్ధులందరినీ మూలన కూర్చోబెట్టాలన్నది నరేంద్రమోడి స్ట్రాటజీ. దాని ప్రకారమే ఒక్కొక్కళ్ళని దూరంగా పెట్టేశారు, మూలన కూర్చోబెట్టేశారు.

ఇందులో భాగంగానే కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా నరేంద్రమోడి ఎంపికచేసి కాళ్ళు చేతులు కట్టేశారు. అప్పటినుండి వెంకయ్య సైలంట్. ఇపుడు రాష్ట్రపతిగా వెంకయ్య పేరు బాగా ప్రచారం జరిగి చివరకు తుస్సుమన్నది. దీన్నే ఎల్లోమీడియా అవమానంగా తెగ బాధపడిపోతోంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే వెంకయ్యను రాష్ట్రపతిగా ఎంపిక చేయబోతున్నట్లు మోడీ చెప్పలేదు. వెంకయ్య రాష్ట్రపతి కావాలన్న తమ కోరికను ఎల్లోమీడియానే ప్రచారం పేరుతో ఊదరగొట్టింది.

అసలు వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికచేస్తే తాము మద్దతిచ్చేది లేదని మోడీకి జగన్మోహన్ రెడ్డి తెగేసిచెప్పినట్లుగా ఇదే ఎల్లోమీడియా కథనాలు అచ్చేసి గంటలకొద్దీ డిబేట్లు పెట్టింది. నిజానికి వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్ధిగా మోడీ అనుకున్నది లేదు జగన్ అడ్డుపడిందీలేదు. అన్నీ ఎల్లోమీడియా ప్రచారం చేసిందే. మంగళవారం సాయంత్రం వెంకయ్య ఇంటికి అమిత్, నడ్డాలు వెళ్ళగానే ఇంకేముంది రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించటం ఒకటే మిగిలిందంటు ఎల్లోమీడియా ఊదరగొట్టేసింది.

తీరాచూస్తే అభ్యర్ధిగా ఎన్డీయే  ద్రౌపదిముర్మును ప్రకటించింది. దాంతో వెంకయ్యకు అవమానమంటు ఎల్లోమీడియా భోరుభోరుమంటోంది. నిజానికి వెంకయ్యకు అవమానమంటు జరిగితే అది ఎల్లోమీడియా వల్లే జరిగింది. తమలోని కోరికను అందరి ఆలోచనగా ప్రచారంచేసి వెంకయ్య రాష్ట్రపతి అయిపోతున్నాడంటూ లేనిపోని కథనాలు అచ్చేసింది ఎల్లోమీడియానే. ఇందులో ఎలాంటి సంబంధంలేకపోయినా జగన్ సీన్లోకి లాగింది ఎల్లోమీడియానే. తాము అనుకున్నది జరగకపోయేసరికి బాధను తట్టుకోలేక చివరకు వెంకయ్యకు అవమానం జరిగిందంటు ఇపుడు భోరుమంటున్నదీ ఎల్లోమీడియానే. ఇపుడు చెప్పండి వెంకయ్యకు అవమానం ఎవరివల్ల జరిగింది ? జరిగిన అవమానానికి బాధ్యులెవరు ?

మరింత సమాచారం తెలుసుకోండి: