మళ్ళీ కరోనా ముంచుకొస్తోంది అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది నాలుగో వేవ్ కి సంకేతమేమో అన్న అనుమానాలు కూడా ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. అసలు వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా ఉదృతి తగ్గడం తో కరోనా నిబంధనలు కనుమరుగైపోయాయి. సోషల్ డిస్టన్స్ అసలు ఎటుపోయిందో, మాస్కులు అయితే చూద్దాం అన్నా కనిపించడం లేదు. జనం అసలు మాస్కులు వేసుకోవడమే పూర్తిగా మానేశారు. సానిటైజర్ లు వాడేవారే కరోవై పోయారు. ఇలా కరోనా నిబందలనలను పూర్తిగా గాలికి వదిలేయడం ప్రమాదానికి దారి తీస్తుందని ముందుంచి నిపుణులు సూచిస్తునే ఉన్నారు.

అలాంటి పరిస్థితి ఇపుడు రానే వచ్చింది అని వార్తలు వినపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి వేగంగా ప్రబలుతున్న విషయం తెలిసిందే.  ఇలా రోజు రోజుకు కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో కరోనా మహమ్మారి మళ్ళీ తిరగబడుతోందా అన్న భయం సర్వత్రా నెలకొంది. వైద్య ఆరోగ్యశాఖ అయితే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు ఎక్కడ చుట్టుముడతాయి అని తెగ కనగారు పడుతున్నారు.  గతేడాది కరోనా సృష్టించిన విలయం నుంచి ఇంకా పూర్తిగా బయటపడక ముందే మళ్లీ కేసులు విపరీతంగా పెరుగుతుండటం తో ఈసారి కరోనా వ్యాప్తి ప్రభావం ఎంత వరకు వెళ్తాయనే ఆందోళన అందరిలోనూ మొదలయ్యింది.  

ముఖ్యంగా ఆ జిల్లాలో గడచిన వారం నుంచి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది.  బుధవారం 41మందికి కొవిడ్‌ సోకగా, గురువారం 45కి పెరిగాయి. ఇందులో 35కేసులు ఒక్క కాకినాడ నగరంలోనే గుర్తించడం తో అక్కడ ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా మళ్ళీ తీవ్రత పెంచుతున్న నేపథ్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా మళ్ళీ కరోనా టెస్ట్‌ల సంఖ్య పెంచే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు అధికారులు. అయితే కరోనా ప్రభావం మాత్రం పెద్దగా లేకుండా ప్రాణాపాయం ఎక్కువుగా లేకపోవడంతో కొంతలో కొంత  స్థిమితంగా ఉండనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: