జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా జైలుకు పంపించి అర్జంటుగా చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రి కుర్చీమద కూర్చోబెట్టాలి. ఇదే టార్గెట్ తో పాపాం ఎల్లోమీడియా గడచిన మూడేళ్ళుగా అహర్నిసలు ప్రయత్నాలు చేస్తునే ఉంది. అసలు 2019 ఎన్నికల్లోనే అధికారంలోకి రాకుండా జగన్ను అడ్డకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అంతా చేసింది ఎల్లోమీడియా. అయితే జనాలు ఈ మీడియాకు వేస్టుపేపర్ కిచ్చేంత విలువ కూడా ఇవ్వకుండా వైసీపీకి అఖండ విజయాన్ని అందించారు.
జగన్ సీఎం అయిన దగ్గరనుండి మళ్ళీ ఒకటేగోల. జగన్ ఈరోజు జైలుకు వెళతాడు..పలానా రోజున జైలుకు వెళతాడని. జగన్ బెయిల్ రద్దయి జైలుకు వెళ్ళటం ఖాయమని పిచ్చిరాతలతో ఒకపుడు ఊదరగొట్టని రోజులేదు. అలాంటిది కొంతకాలం కామ్ గా ఉండి మళ్ళీ ఇపుడు అదే పాట మొదలుపెట్టింది. తాజాగా అచ్చయిన చెత్తపలుకులో జగన్ బెయిల్ పై పరస్పర విరుద్ధమైన రాతలు ఆశ్చర్యంగా ఉంది. ఒకచోటేమో జగన్ బెయిల్ రద్దయి భార్య భారతీరెడ్డి ముఖ్యమంత్రి అవుతుందని రాశారు.
మరోచోటేమే నరేంద్రమోడికి జగన్ దత్తపుత్రుడని రాశారు. ఢిల్లీ పెద్దల దగ్గర జగన్ పలుకుబడి అరచేతిమందాన ఉందని రాశారు. నిజంగానే మోడి దగ్గర జగన్ పలుకుబడి అరచేతిమందాన ఉంటే బెయిల్ ఎలా రద్దవుతుంది. నిజంగానే మోడీకి దత్తపుత్రుడైతే జగన్ బెయిల్ ఎలా రద్దయి జైలుకు వెళ్ళడుకదా. ఇంత పరస్పర విరుద్ధమైన రాతలు ఎవరైనా రాస్తారా ? దీన్నే మతిలేని రాతలంటారు. బెయిల్ రద్దవుతుందని ఎల్లోమీడియానే రాస్తుంది. మళ్ళీ జగన్ పలుకుబడి విపరీతంగా ఉందనీ ఎల్లోమీడియానే రాస్తుంది.
నిజంగానే ఢిల్లీపెద్దల దగ్గర అంతపలుకుబడి ఉంటే బెయిల్ రద్దు విషయంలో జగన్ భయపడాల్సిన పనేలేదు కదా. నిజానికి ఎల్లోమీడియా ఏదో ఒకటే రాయాలి. అంతేకానీ అచ్చేసిన రాతల్లో ఒకచోట ఒకలాగ మరోచోట మరోలాగ ఎందుకు అచ్చేస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒకటి జగన్ కు వ్యతిరేకంగా వండివార్చాలి కాబట్టి బుర్రకు తోచింది అచ్చేస్తున్నారు. ఇందుకేనా దీన్ని జనాలు చెత్తపలుకని అంటున్నది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి