చివరకు ఫార్టీఇయర్స్ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు కొంపను వ్యూహకర్తే ముంచేసేట్లుగా ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీని ఎలాగైనా అధికారంలోకి తేవాలని చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికలు చంద్రబాబు, టీడీపీకి హిటౌట్ ఆర్ గెటౌట్ అన్నట్లుగా తయారైంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డే గెలిస్తే టీడీపీ పరిస్ధితి ఎలా తయారవుతుందో ఎవరికి వాళ్ళుగా ఊహించుకోవాల్సిందే.





అందుకనే ప్రత్యేకంగా రాబిన్ శర్మ అనే వ్యూహకర్తను చంద్రబాబు నియమించుకున్నారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలోనే ఈయన వ్యూహాలు పనిచేయలేదన్న విషయం అర్ధమైపోయింది. సరే అప్పుడు జరిగింది ఉపఎన్నిక కదా రాబిన్ తో కాంట్రాక్టు కుదుర్చుకున్నది జనరల్ ఎన్నికల కోసంకదా అని అందరు పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా చంద్రబాబు పద్దతి చూస్తుంటే చివరకు రాబినే పార్టీ కొంపముంచేసేట్లుగా ఉన్నాడనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.





పార్టీ తరపున ఒక వ్యూహకర్త పనిచేస్తున్నాడంటే అధినేత ప్రచారం, టచ్ చేయాల్సిన అంశాలు, జనాల దగ్గరకు వెళ్ళినపుడు ప్రస్తావించాల్సిన ఇష్యూస్, జనాలను తమవైపుకు తిప్పుకోవటానికి అవలంభించాల్సిన మాయలు, మంత్రాలు అన్నింటినీ దగ్గరుండి చూసుకోవాలి. కానీ చంద్రబాబు చేస్తున్నదేమిటి ? అనేదే పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కోనసీమ జిల్లాలో రెండురోజులు వరద బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా ఎవరైనా ఏమి మాట్లాడుతారు ? ప్రభుత్వం సాయం అందుతోందా ? పడుతున్న ఇబ్బందులేమిటి ? తిండి, మందులు తదితర నిత్యవాసరాలు అందుతున్న వైనం గురించి ఆడుగుతారు.





అయితే చంద్రబాబు మాత్రం శ్రీలంకలో పరిస్ధితుల గురించి, జగన్ అవినీతిగురించి పదే పదే మాట్లాడుతున్నారు. వరద బాధితుల దగ్గరకు వెళ్ళి శ్రీలంక, జగన్ అవినీతిగురించి మాట్లాడితే ఉపయోగం ఏముంటుంది ? అసలక్కడ ప్రస్తావించాల్సిన అంశాలేనా ? అన్న విచక్షణ కూడా చంద్రబాబు కోల్పోయారు. ఎంతసేపు జగన్ కు వ్యతిరేకంగా ఏదోఒకటి మాట్లాడేయాలి, ఎంత వీలైత అంత బురదచల్లేయాలన్న కేసే చంద్రబాబులో కనబడుతోంది. ఇందుకనే అధినేత విచక్షణ కోల్పోతున్నారు. మరి వ్యూహకర్త రాబిన్ ఏమిచేస్తున్నట్లు ? లేదా రాబిన్ సూచనల ప్రకారమే చంద్రబాబు మాట్లాడుతున్నారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: