పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. నూరేళ్ళ పాటు కలిసి ఉండే బంధం విషయంలో ఎంతో మంది ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందుకే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అని చూడాలి అని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు తమకు నచ్చిన భాగస్వామిని తమ జీవితంలోకి ఆహ్వానించి ఇక సంతోషంగా ఉండాలని భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే ఐదు రోజుల పాటు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగేవి.


 కానీ ఇటీవలి కాలంలో పెళ్లిళ్లు మాత్రం అంత సందడిగా జరగడం లేదు అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా పట్టణాలు నగరాలలో అయితే పెళ్లిళ్లు అనేది ఆన్లైన్ మయం అయిపోయాయి. ఇటీవలికాలంలో మ్యాట్రిమోనీ లోనే పెళ్లి చూపులు జరిగిపోతున్నాయి. తమకు కావాల్సిన వరుడిని.. వరుడికి  ఉన్న క్వాలిటీ లను  చూసి ఇక మ్యాట్రిమోనీ లో చూస్తూ పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు మ్యాట్రిమోనీ సైట్ లో పెళ్లి కొడుకులు దొరుకుతారు  అన్న విషయం అందరికీ తెలుసు.. కానీ ఏకంగాకూరగాయల మార్కెట్ లాగానే పెళ్లి కొడుకుల మార్కెట్ కూడా నిర్వహిస్తారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటిదే చేస్తున్నారు. బీహార్లోని మధుబని జిల్లాలో ప్రతి ఏటా తొమ్మిది రోజుల పాటు పెళ్లి కొడుకుల మార్కెట్ నిర్వహిస్తారట. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజంగానే జరుగుతుందట. అయితే 700 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతున్నదని స్థానికులు చెబుతుండటం గమనార్హం.  ఇక ఈ పెళ్లి కొడుకుల మార్కెట్కు సౌరత్ సభ అనే పేరు కూడా పెట్టారట. మైతిల్ బ్రాహ్మిన్ సమాజానికి చెందినవారు తమ కుమార్తెలతో మార్కెట్ కి వస్తారు. ఇక అక్కడ నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటారట. అయితే కుటుంబం ఉద్యోగం విద్యార్హతలు ఆస్తుల విలువను బట్టి పెళ్ళి కొడుకులకు రేటు నిర్ణయిస్తారట. ఏమైనా ఇది కాస్త విచిత్రంగా ఉంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: