ఏపీలో బలం కోసం బీజేపీ బస్సు యాత్ర?

బీజేపీ : ఏపీలో బీజేపీ తమ బలం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయి. వాటి గురించి తెలిపేందుకు బీజేపీ బస్సుయాత్ర చేపట్టింది. 2024 ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి పార్టీ ఎన్నికల లక్ష్యంగా ప్రజా పోరు రథ యాత్ర ప్రారంభించింది. ప్రస్తుతం అధికార పార్టీ యొక్క వైఫల్యాలను చెప్తూ .. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో వివరించడమే తన లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రం అంతా తిరిగేందుకు రథాలను స్పెషల్‌గా డిజైన్‌ చేయించుకున్నారు. బీజేపీ చేపట్టిన 'ప్రజా పోరు' బస్సు యాత్రను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విశాఖపట్నంలో ప్రారంభించారు. 2024లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఈ ప్రజాపోరు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల సభలు నిర్వహించి బీజేపీని ప్రజలకు చేరువ చేస్తామని సోము వీర్రాజు తెలిపారు. 


కేంద్రం అందిస్తున్న పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిని రానున్న రోజుల్లో బీజేపీకి ఓటు బ్యాంకుగా మార్చు కుంటామని చెప్పారు.వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా, నేటికీ, మూడు రాజధానుల పాటే పాడుతోందని విమర్శించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించకుండా అక్కడి ఆదాయాన్ని బ్లాక్ మనీగా సమకూర్చుకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. సుదీర్ఘ తీరప్రాంతమున్న ఏపీలో అనేక పరిశ్రమల అభివృద్ధికి 60 శాతం పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీలు రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాపోరు యాత్ర ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధా నాలపై పోరాటాలకు ప్రజలను సమాయత్తం చేస్తామని తెలిపారు. 2019 ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను దృష్టిలో పెట్టుకొని ఈ రథయాత్ర ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: