చంద్రబాబునాయుడు అంత ధైర్యం చేస్తారని ఎవరు అనుకోవటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణా టీడీపీలో చైతన్యం తీసుకురావటానికి చంద్రబాబు యాక్టివ్ అవుతారట. ఈ విషయం చెప్పింది చంద్రబాబు కాదు. తెలంగాణా అధ్యక్షుడిగా ఈమధ్యనే  బాధ్యతలు తీసుకున్న కాసాని జ్ఞానేశ్వర్. పార్టీ బలోపేతానికి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు యాక్టివ్ అవబోతున్నట్లు తెలంగాణా అధ్యక్షుడు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.




                


వచ్చే నెల 21వ తేదీన ఖమ్మంలో బహిరంగసభ నిర్వహణతో టీడీపీ స్పీడవబోతున్నట్లు చెప్పారు. బహిరంగసభకు చంద్రబాబే ముఖ్యఅతిధిగా హాజరవుతారట. అక్కడి నుండి రెగ్యులర్ గా అన్నీ జిల్లాల్లో బహిరంగసభలు పెట్టి పార్టీ బలోపేతానికి అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటామని కాసాని చప్పారు.  119 నియోజకవర్గాల్లోను టీడీపీ పోటీచేస్తుందన్నారు. పార్టీ బలోపేతం గురించి కాసాని చాలానే ఛెప్పారు కానీ అసలు చంద్రబాబు తెలంగాణా పాలిటిక్స్ కు ఎందుకు దూరంగా ఉంటున్నారు ?




           

కేసీయార్ ప్రభుత్వాన్ని కూలదోయాలనే ఉద్దేశ్యంతోనే 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు ఓటుకునోటు పేరుతో కుట్ర చేశారు. ఆ కుట్రను కేసీయార్ పసిగట్టి ఎదురుదెబ్బ తీశారు. దాంతో అరెస్టుకు భయపడి చంద్రబాబు అర్ధాంతరంగా హైదరాబాద్ ను వదిలేసి విజయవాడకు పారిపోయారని అందరికీ తెలుసు. అప్పటినుండి తెలంగాణా రాజకీయాల్లో వేలుపెట్టాలంటేనే భయపడుతున్నారు. తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని మళ్ళీ ప్రయత్నించినా తలబొప్పికట్టింది. ఇక లాభంలేదనుకుని అప్పటినుండి పూర్తిగా తెలంగాణాను వదిలేశారు.






అలాంటిది ఇపుడు కాసాని అధ్యక్షుడు కాగానే చంద్రబాబు తెలంగాణా రాజకీయాల్లో యాక్టివ్ అయిపోతారా ? చంద్రబాబు రాజకీయ జీవితం దాదాపు క్లైమ్యాక్సుకు చేరుకుంటోంది. ఇలాంటి సమయంలో రిస్కు తీసుకుంటారని ఎవరు అనుకోవటంలేదు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో  తెలంగాణాలో టీడీపీకి మళ్ళీ దెబ్బపడితే దాని ప్రభావం ఆ తర్వాత జరగబోయే ఏపీ ఎన్నికల మీదా పడుతుంది. కాబట్టి కాసాని చెప్పారుకదాని చంద్రబాబు  అంత ధైర్యం చేస్తారనే నమ్మకం ఎవరిలోను లేదు. కొంతకాలం కాసాని ఇలాచెప్పుకుంటు కాలక్షేపం చేయచ్చంతే.   

మరింత సమాచారం తెలుసుకోండి: