సమాజంలో కొంతమంది ఉన్నతమైన ఆలోచన శైలి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటుంది అని చెప్పాలి. తాము ఈ లోకంలో ఉన్న లేకపోయినా ఎదుటి వారికి మంచి జరగాలి అనే కోరుకునే వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఎవరు ఎటు పోతే మనకేంటి మనం హ్యాపీగా ఉన్నామా లేదా అని ప్రతి ఒక్కరూ భావిస్తున్న నేటి సమాజంలో అక్కడక్కడ తాము చనిపోతూనే ఎదుటివారికి ప్రాణాల పోయాలనుకునే వారు కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా చనిపోయిన సమయంలో తమ శరీర అవయవాలను హాస్పిటల్స్ కి దానం చేసి ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించడం లాంటివి చేస్తూ ఉంటారు.


 అయితే అవయవ దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చు అని ఎంతలా అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఎంతోమంది అవయవదానం చేయడానికి ముందుకు రావడం లేదు అని చెప్పాలి. కానీ కొంతమంది మాత్రం అవయవదాన విషయంలో ఎంతో గొప్పగా ఆలోచిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. రాజస్థాన్లోని బిల్వారాలో ఇలాంటి తరహా కఠిన వెలుగు చూసింది. భూపాల్ సింగ్ రాథోడ్ భార్య కొన్ని రోజుల నుండి అనారోగ్య  సమస్యలతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది అని చెప్పాలి. అయితే ఆమె తన భర్త దగ్గర 2019లో ఒక మాట తీసుకుంది


 ఒకవేళ నేను అనారోగ్యంతో చనిపోతే.. నా మృతదేహాన్ని దహనం చేయకండి.. మెడికల్ కాలేజీకి ఇచ్చి అవయవ దానం చేసి.. కొంతమంది ప్రాణాలు అయినా నిలబెట్టడానికి ప్రయత్నించండి అంటూ ఒక మాట తీసుకుంది. ఇకపోతే ఇటీవల సదరు మహిళ అనారోగ్య సమస్యలతో మరణించింది. దీంతో భర్త భూపాల్ సింగ్ రాథోడ్ ఇక భార్యకు మాట ఇచ్చిన విధంగానే చివరి కోరిక తీర్చాడు. విజయ్ రాజే సేంతియా మెడికల్ కాలేజీకి మృతదేహాన్ని అప్పగించాడు.. అవయవ దానం ఎంతో గొప్పదని ప్రతి ఒక్కరు కూడా అవయవదానం చేయాలంటూ సదరు వ్యక్తి సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: