మన అఖండ భారత దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈరోజు 91వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా మన ప్రియమైన మాజీ ప్రధానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 91వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


 ప్రధాని మోడీ తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. ''మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.మీరు ఎక్కువ రోజులు ఆరోగ్యకరమైన జీవితం పొందాలని నేను ప్రార్థిస్తున్నాను'' అని ప్రధాని రాసుకొచ్చారు. అలాగే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సైతం మన్మోహన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని చక్వాల్ జిల్లాలో జన్మించారు. అయితే ఈ జిల్లా ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉంది. ప్రధాని పదవిని చేపట్టడానికి ముందు, ఆయన 1982 నుంచి 1985 దాకా bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పనిచేశారు. మన తెలుగు వారికి గర్వ కారణం అయిన మాజీ ప్రధాని నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. 1991వ సంవత్సరంలో భారతదేశంలో ఆర్థిక సరళీకరణ తీసుకురావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.మన్మోహన్ సింగ్ వల్లనే దేశంలో ‘లైసెన్స్ రాజ్’ అంతరించిపోయిందని అంటారు.మన్మోహన్ సింగ్ 2004 వ సంవత్సరం నుంచి 2014 వ సంవత్సరం దాకా రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా పనిచేశారు. ఆయన కేవలం దేశంలోని గొప్ప రాజకీయవేత్త మాత్రమే కాదు, అద్భుతమైన ఆర్థికవేత్తగా కూడా మంచి గుర్తింపు పొందారు.


1962 వ సంవత్సరంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డి.ఫిల్ పూర్తి చేశారు. ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం ఇంకా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అధ్యాపకుడిగా కూడా పనిచేశారు.ఇక UNCTAG సెక్రటేరియట్‌లో కొంతకాలం పనిచేసిన తర్వాత, 1987 వ సంవత్సరం నుంచి 1990 వ సంవత్సరం మధ్య జెనీవాలో సౌత్ ఆఫ్రికా కమిషన్ సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు.మన్మోహన్ సింగ్ 1970 వ సంవత్సరం నుంచి 1980 వ సంవత్సరం మధ్య భారత ప్రభుత్వంలో చాలా కీలక పదవులు నిర్వహించారు. ప్రధాన ఆర్థిక సలహాదారు (1972-76), రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (1982-85) ఇంకా ప్రణాళికా సంఘం ఛైర్మన్ (1985-87) గా కూడా పనిచేశారు. 1991 వ సంవత్సరం నుంచి 1996 వ సంవత్సరం మధ్య దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు.ఇక మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: