
ఏకంగా బలమైన ప్రతిపక్ష హోదా సాధిస్తుంది అనుకున్నారు. కానీ ఇలా ఏకంగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ లో సైతం దెబ్బకొట్టి మ్యాజిక్ ఫిగర్ ను దాటి భారీ స్థానాలను సొంతం చేసుకుంటుంది అని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. అయితే ఇక మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అటు తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి ఓడిపోయిన అభ్యర్థులకు సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా అందరిని షాక్ కి గురి చేస్తూ ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఏకంగా తెలంగాణ ఎన్నికల్లో గెలుపెరుగని పోరాట యోధుడికి మరోసారి ఓటమి ఎదురైంది అన్న విషయం గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి. ఆయన 30 ఏళ్లుగా ఎమ్మెల్యే కావాలని పోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకు 6 ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. అయితే పదవుల కోసం పార్టీలు మారుతున్న ఈ రోజుల్లో ఆయన 1984 నుంచి బిజెపిలోనే కొనసాగుతున్నారు . అయితే 2014లో వంశీచంద్ రెడ్డి పై ఎమ్మెల్యేగా పోటీ చేసి 78 ఓట్ల స్పల్ప తేడాతో తృటిలో ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్నారు.