ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను వేగవంతంగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా రా కదలిరా సభ పేరుతో ఆ పార్టీ అధినేత ప్రతిపక్షనాయుడు చంద్రబాబు నాయుడు పలు ప్రాంతాలలో బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న ఈ సభలు అటు టిడిపి, జనసేన మధ్య చాలా గొడవలకు అద్దం పడుతున్నాయి. పలు అంశాల పైన రెండు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఒకే గూటికి రావట్లేదు. ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన సీట్ల పంపకాల వ్యవహారం నుంచి ఎన్నో పరిణామాలకు దారితీస్తోంది.


పల్లె ప్రాంతాలలో కలిసిమెలిసి పని చేయాలన్న నాయకులు సైతం చెప్పినప్పటికీ కార్యకర్తలు మాత్రం కొట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా టిడిపి జనసేన మధ్య పలు అంశాల పైన చాలా విభేదాలు కూడా మొదలవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండడంతో జనసేన నాయకులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.. గతంలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టిడిపి మధ్య సభ ఏర్పాటు చేయక అందులో నాయకులు కూడా చాలా గొడవలు పడ్డారు పెద్ద ఎత్తున వాద్వాహానికి దిగిన ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ఆయన చిత్తూరులో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది.


గంగాధర నెల్లూరులో చంద్రబాబు ఏర్పాటుచేసిన రా కదలిరా సభలు జనసేన టిడిపి కార్యకర్తల మధ్య మరొకసారి విభేదాలు బయటపడ్డాయి. ఒకరినొకరు పోట్లాడుకున్నప్పటికీ చివరికి కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో అక్కడున్న జనసేన కార్యకర్తలను టిడిపి కార్యకర్తలు తరిమికొట్టడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ సీఎం అని నినాదం చేయడంతోనే అక్కడ టిడిపి కార్యకర్తలు ఇలా దాడికి దిగారని చెబుతున్నారు. ఈ సభ వల్ల అక్కడ ప్రాంతం చాలా రణరంగంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

WAR