ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయలలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలు కూడా సరికొత్త వ్యూహాలు అమలు చేస్తూ ముందుకు వెళుతున్నాయి.. కూటమి అయిన బిజెపి జనసేన టిడిపి పార్టీలో తమ అభ్యర్థులను ఇంకా ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ సమయంలోనే వైసీపీ తమ అభ్యర్థులను సైతం ప్రకటించింది. పొత్తులో భాగంగా సీట్లు రాని కొంతమంది టిడిపి నేతలు వైయస్సార్సీపీ నాయకులతో టచ్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా మాజీ మంత్రి చంద్రబాబు సన్నిహితుడు వైసిపి నేతలతో టచ్ లో ఉన్నట్లుగా సమాచారం.


విశాఖ జిల్లాలో జనసేన పొత్తు కారణం వల్ల సీనియర్ నేతలకు అసలు సీట్లు దక్కనే లేదు..ఇప్పటికే పలువురు నేతలు కూడా పార్టీకి రాజీనామా చేశారు మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్ బండారు సత్యనారాయణ వంటి నేతలు కూడా సీట్ల కోసం చివరి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. అంతేకాకుండా బండారు సత్యనారాయణ నియోజకవర్గమైన పెందుర్తి స్థానం ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చేశారు. దీంతో ఆయన నిరుత్సాహపడడంతో వైసిపి నేతలు టచ్లోకి వెళ్లారు.. దీంతో తమ పార్టీలోకి రావాలని ఆఫర్ ని కూడా ఇవ్వడం జరిగింది.. అయితే పెందుర్తి అసెంబ్లీ స్థానం ఇప్పటికే అదీప్ రాజుకు వైసిపి పార్టీ కేటాయించింది.


అయితే బండారుకు అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తామంటు వైసిపి నుంచి హామీ వచ్చినట్లు సమాచారం. వైసీపీ నుంచి వచ్చిన ఈ ఆఫర్ తో తన మద్దతుదారులతో బండారు చర్చలు జరిపిన తర్వాత.. టిడిపి నేతలతో అసంతృప్తులను కలుపుకొని వైసీపీలోకి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేయడానికి బండారు కూడా సిద్ధంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన ఇంకా ఆయన స్పందించారు.. తాను తన మద్దతు దారులతో చర్చలు జరిపిన తరువాతనే రెండు రోజులలో తగిన నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటిస్తానంటూ వెల్లడించారు.. టిడిపి జనసేన పొత్తులో భాగంగా పెందుర్తి అనకాపల్లి విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానాలు జనసేనకే కేటాయించారు. బండారు కు చంద్రబాబుకు మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అనకాపల్లి సీటు మాత్రమే వైసీపీలో ఖాళీగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: