ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పార్లమెంటు ఎన్నికల హడావిడిని కనిపిస్తుంది. గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని పార్టీల పెద్దలు.. ఇక ఎలాగైనా టికెట్ దక్కించుకుని గెలిచి చూపించాలని ఆశవాహులు.. తమ అభిమాన నాయకుడికి టికెట్ దక్కిందంటే ఎట్టి పరిస్థితుల్లో మద్దతుగా నిలిచి గెలిపించుకోవాలని ఓటర్లు ఇలా అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల హడావిడి లోనే ఉన్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఈసారి తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటుంది. అయితే మొన్నటికి మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక బిజెపి అగ్ర నేతలు అందరూ కూడా విజయం సాధించలేకపోయారు.


 దీంతో ఈటల రాజేందర్ రఘునందన్ రావు సహ మరి కొంతమంది కీలక నేతలకు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మళ్లీ అవకాశం కల్పించింది బిజెపి. అయితే కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలతో పోల్చి చూస్తే అటు బిజెపికి తెలంగాణలో క్యాడర్ తక్కువే. ఈ క్రమంలోనే ఉన్న నేతలతోనే పార్టీని బలోపేతం చేసుకునేందుకు బిజెపి ఎన్నో రోజుల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి సమయంలో బిజెపిలో కీలక నేతగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజాసింగ్ వ్యవహారం ప్రస్తుతం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇటీవల తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి  ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు మీటింగ్ కు రాజాసింగ్ హాజరు కాలేదు.


 బిజెపి పేరు చెబితేనే ప్రాణమిచ్చే రాజా సింగ్  ఇలా ఎందుకు దూరంగా ఉన్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అసెంబ్లీలో బిజెపి లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అవకాశం దక్కకపోవడంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోక్ సభకు పోటీ చేయాలని అనుకున్నారట. జహీరాబాద్ లేదా హైదరాబాద్ టికెట్ ఆశించారట  కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరికి కూడా బిజెపి పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి కనపరచలేదు. హైదరాబాద్ ఎంపీ టికెట్ ను మాధవి లతకు కేటాయించిన సందర్భంలో.. అక్కడ పోటీ చేయడానికి మగాళ్లే దొరకలేదా అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు రాజా సింగ్. ఇలా ఎంపీ టికెట్ ఇవ్వలేదనే కారణంతోనే అలకబూని పార్టీ వ్యవహారాలన్నింటికీ కూడా దూరంగానే ఉంటున్నాడట. ఒకరకంగా బిజెపిపై మినీ సైజ్ తిరుగుబాటే చేస్తున్నారు రాజాసింగ్  ఇక రానున్న రోజుల్లో రాజాసింగ్ వ్యవహారం పై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: