ఎన్నికలు వచ్చాయి అంటే చాలు ఏ స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలి అనే విషయంపై పార్టీ పెద్దలు మల్ల గుల్లాలు పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు పావులు కదుపుతూ ఉంటారు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతుంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది.


 ఈ క్రమంలోనే కొన్ని చోట్ల మాత్రం ఇక సరైన అభ్యర్థులను ఎన్నుకోవడంలో బిజెపి పెద్దలు సరైన వ్యూహాలు అమలు చేయడం లేదు అనే వాదన కూడా వినిపిస్తుంది. ఇక ఖమ్మంలో ఇదే పరిస్థితి నెలకొంది అన్నది తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఖమ్మంలో ఇప్పటికే  బిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి ఎవరు అన్నది ఖరారు కాలేదు. అయితే బిజెపి నుంచి తాండ్ర వినోద్ రావు కు టికెట్ ఇచ్చింది బిజెపి. అయితే ఇదే బిజెపికి మైనస్ కాబోతుందా అంటే.. కొందరు అవును అనే చెబుతున్నారు.



 ఎందుకంటే ఖమ్మం పార్లమెంట్ టికెట్ ని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆశించారు.  బిజెపి శ్రేణులు కూడా ఆయనకే టికెట్ వస్తుందని ఇక భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇలాంటి సమయంలో ఊహించని విధంగా బిజెపి అధిష్టానం తాండ్ర వినోద్ రావు అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. అయితే గతంలో జలగం వెంకట్రావు 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎమ్మెల్యేగా, 2014లో బిఆర్ఎస్ పార్టీ నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసమే బిజెపిలో చేరారు. ఆయనకు ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్లోని ఏడు నియోజకవర్గాల్లో కూడా మంచి పట్టు ఉంది. తాండ్రా వినోద్ రావు మాత్రం విదేశాల్లో పనిచేసి కొత్తగా రాజకీయాల్లోకి రావడం గమనార్హం. ఈ క్రమంలోనే వెంకట్రావుకు సీటు వచ్చి ఉంటే బాగుండేదని పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నారట. ఇదే బిజెపి పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp