కూటమిలో భాగంగా అటు టిడిపి జనసేన బిజెపి పార్టీలు సీట్ల విషయంతో అటు అటు అభ్యర్థుల విషయంలో కూడా నాన అవస్థలు పడుతూ ఉన్నారు.. ఎట్టకేలకు అభ్యర్థులను కూడా ప్రకటించినప్పటికీ కొన్నిచోట్ల నిరసనలు కూడా వెలువబడుతున్నాయి.. పార్టీని నమ్ముకున్న వారికి టికెట్ ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వడంతో అటు నేతలు కార్యకర్తలు ఫైర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఇండియన్ హెరాల్డ్ కు అందుతున్న సమాచారం ప్రకారం కడప టిడిపి నేతలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.



ఇండియన్ హెరాల్డ్ కు అందిన సమాచారం ప్రకారం కడప ఎంపీ అభ్యర్థి మీరే అంటూ రోజుకొక నాయకుడు పేరును సర్వేల ప్రకారం తో వెన్నుపోటు పొడుస్తున్నారట చంద్రబాబు. అంతేకాకుండా టికెట్ రాని నేతలను కూడా మభ్య పెట్టేందుకు చంద్రబాబు పక్క ప్రణాళికతోనే వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అక్కడ నేతలు సైతం పసిగట్టారు. ముఖ్యంగా చంద్రబాబు సైతం అందరిని మోసగిస్తున్నారని అనుమానాలు కూడా అక్కడి నేతలలో మొదలయ్యాయి. తాజాగా కడప ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఉక్కు ప్రవీణ్ పేరుతో చంద్రబాబు నాయుడు ఒక ఐ.వి.ఆర్.ఎస్ సర్వేను కూడా చేపట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.


మొదట టిడిపి సభ్యుడిగా ఆర్ శ్రీనివాస్ రెడ్డి పేరుతో ఒక సర్వే చేయించారు అయితే.. కొన్ని కారణాలు చేత ఆయన పక్కనికి పెట్టేశారు. ఆ తర్వాత వివేక భార్య సౌభాగ్యమ్మ పేరుని కూడా తీసుకువచ్చారు. మళ్లీ సౌభాగ్యమ్మ కూతురు సునీత పేరుతో కూడా అనుకూలంగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.. ఈ విషయాలన్నీ అటు వివేక భార్య కుమార్తె కూడా వెంటనే పసిగట్టి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు ఇండియన్ హెరాల్డ్ కు సమాచారం.


మళ్లీ ఇటీవలే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేరుతో ఒక సర్వేను కూడా చేయించారట. దీంతో అక్కడి కార్యకర్తలు కడప ఎంపీ బరిలో ఇతను ఉంటారని ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే ఆ వెంటనే మళ్ళీ టిడిపి ఇన్చార్జ్ జమ్మలమడుకి ఉన్నటువంటి భూషష్ రెడ్డి పేరుతో మరొక సర్వే నిర్వహించారు. ఇది కూడా ఎక్కువ రోజులు నిలబడలేదు ఇప్పుడు మళ్లీ తాజాగా ఉక్కు ప్రవీణ్ రెడ్డి పేరుతో కడప ఎంపీ అభ్యర్థి అంటూ ఒక సర్వేను చేపట్టగా.. అక్కడ నేతలు అందరూ చంద్రబాబు పైన ఫైర్ అవుతున్నారు.


ఇండియన్ హెరాల్డ్ కు వచ్చిన సమాచారం ప్రకారం.. వీర శివారెడ్డి, భూషేష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి లకు చంద్రబాబు అసలు టికెట్లు ఇవ్వలేదని సమాచారం. దీంతో వీరందరూ ఇలా చాలా అసంతృప్తి నెలకొంది. కేవలం సర్వేల ప్రేయర్ తో వీరందరిని మభ్యపెట్టే పనిలో చంద్రబాబు ఉన్నారని ఒకవేళ వీరందరూ కనుక ఒకటైతే టిడిపి కడపలో ఓడిపోవడం ఖాయమని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: