ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే..ప్రచారంలో భాగంగా  శనివారం సాయంత్రం జగన్ బస్సు యాత్ర విజయవాడకు చేరుకుంది.చీకటి పడ్డాక వివేకానంద స్కూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై రాయి విసిరాడు.ఈ ఘటనలో జగన్ గాయపడ్డారు. ఆయన ఎడమకంటి పైభాగం, నుదుటిపై గాయమైంది. దీనితో జగన్ కి అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేశారు. అనంతరం జగన్ బస్సు యాత్రను యధాతథంగా కొనసాగించారు. రాత్రి బస్సు యాత్ర విరామం తరువాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.డాక్టర్ లు ఇచ్చిన సూచన ప్రకారం నేడు బస్సు యాత్ర కి బ్రేక్ పడింది. అయితే జగన్ పై జరిగిన దాడి విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం జగన్ పై దాడి పిరికిపంద చర్య అని వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.జగన్ పై దాడి విషయంలో వైసీపీ కి  వ్యతిరేకంగా టీడీపీ ట్వీట్లు చేస్తున్నా చంద్రబాబు మాత్రం జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించడం జరిగింది.. 

అలాగే దేశంలో పలు కీలక నేతలు సైతం జగన్ పై జరిగిన దాడిని ఖండించారు.అయితే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ పై దాడి విషయంలో సైలెంట్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా స్పందించకపోయినా సోషల్ మీడియా వేదికగా అయినా రియాక్ట్ అవుతారని చాలామంది భావించారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది.పవన్ కళ్యాణ్ ఇలాంటి ఘటనల విషయంలో స్పందించకుండా ఇస్తున్న సందేశం ఏంటని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పాజిటివ్ గా స్పందించినా నెగిటివ్ గా స్పందించినా అనుకోని సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆ కారణం వల్లే ఈ విషయం పై పవన్ కళ్యాణ్ స్పందించే ఆలోచన చేయడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అలాగే గతంలో చంద్రబాబుపై దాడి జరిగిన సమయంలో ఘాటుగా స్పందించిన నేతలే ఇప్పుడు సీఎం జగన్ ను అవహేళన చేస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా కొన్ని విషయాలలో తన పంథా మార్చుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో చిన్న దాడి జరిగినా ఘాటుగా స్పందించే పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్ విషయంలో ఇంత పెద్ద ఘటన జరిగినా సైలెంట్ గా ఉండటం జనసేనకు భవిష్యత్ లో మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..మరి తరువాత అయిన పవన్ ఈ ఘటన గురించి రియాక్ట్ అవుతారో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: