ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు  చాలా రసవత్తరంగా   కొనసాగు తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ నేతలు నియోజకవర్గాల్లో చాలా స్పీడ్ గా పర్యటనలు చేస్తూ  ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే తరుణంలో  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త సంఘటన తెరపైకి వస్తోంది. మొన్నటి విజయవాడ పర్యటనలో  సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది.  దీంతో ఆయన కన్ను పై భాగం దగ్గర కాస్త గాయం అయింది. ఈ రాయి దాడి చేసింది ఎవరు అనేది ఇంకా బయటకు రాలేదు. దీనిపై వైసీపీ నాయకులు స్పందిస్తూ .. ఇదంతా టిడిపి నాయకులే చేయిస్తున్నారని, మా మీటింగ్స్ కి వచ్చే స్పందన చూసి ఓర్వ లేకనే ఇలా చేస్తున్నారని వారు ఆరోపించారు. 

ఇదే తరుణంలో  టిడిపి అధినేత చంద్ర బాబుపై కూడా రాళ్ల దాడి జరిగింది. ఆయన అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటన చేస్తున్న సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం లోని గాజువాకలో సభ జరుగుతూ ఉండగా గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు  చంద్రబాబు పై  రాళ్లు విసిరారు. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేసి ఉంటారని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. మేము జగన్ మీద రాళ్లు వేసామని వైయస్సార్ పార్టీ వాళ్లు భావించుకొని, మా మీద వేశారని చంద్రబాబు ఆరోపించారు.

రాళ్లు విసిరిన వ్యక్తులకి చంద్రబాబు మైకులో నుంచే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి దాడులైన నేను భయపడను నాకు అలా రాళ్లు విసిరించుకునే అలవాటు లేదని అన్నారు. చంద్ర బాబుపై ఈ ఘటన జరగగానే  భద్రతా సిబ్బంది అలెర్ట్ అయ్యారు. ఈ క్రమంలో అక్కడే ఉన్నటువంటి టిడిపి కార్య కర్తలు చాలామంది కొట్టుకోవడంతో ఆ రాళ్లు విసిరిన వ్యక్తులు తప్పించుకో గలిగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాళ్ల రాజకీయమైతే విపరీతంగా జరుగుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: