ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అనే పేరుతో ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని ప్రాంతాలను చుట్టేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో గత శనివారం విజయవాడలో పర్యటిస్తూ ఉండగా రాయి దాడి జరగడం జరిగింది. దీంతో సీఎం జగన్ కు ఎడమ కంటి పైన కాస్త పెద్దగానే గాయం అయింది. అయితే చికిత్స అనంతరం మళ్లీ ఇవాళ ఉదయం కేసరపల్లి క్యాంపు సైట్లో తనను కలిసే కు వచ్చిన వైసీపీ నేతలతో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు..


బస్సు యాత్రకు వస్తున్నటువంటి ఆదరణ చూసే తన పైన ఇలాంటి దాడులు చేస్తున్నారంటూ జగన్ అక్కడి నేతలతో వ్యాఖ్యానించారు . అయితే ప్రజల ఆశీర్వాదం వల్ల తాను  ప్రాణాల నుంచి బయటపడ్డానని కూడా తెలియజేశారు. కచ్చితంగా మరొకసారి అధికారంలోకి వస్తామని.. ఎవరు ఎలాంటి ఆందోళన పడవద్దు.. అంటూ పార్టీ నేతలకు కూడా సీఎం జగన్ సూచించారు. ఎలాంటి దాడులు తనని ఆపలేవని ధైర్యంతోనే ముందడుగు వేస్తానని కూడా నేతలతో తెలియజేశారు. దేవుడు దయ,  ప్రజల ఆశీర్వాదం తనకు ఉన్నాయని.. అందుకే ధైర్యంగా అడుగులు ముందుకు వేయబోతున్నానని..ఎవరు కూడా అధైర్యపడవలసిన పని లేదంటూ అక్కడి నేతలతో జగన్ మాట్లాడారు.


సీఎం జగన్ బస్సు యాత్రలో భాగంగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి పలు నియోజకవర్గాలలోని నాయకులు కార్యకర్తలను కూడా కలుస్తారని.. ఈ రోజున కృష్ణ , ఎన్టీఆర్ జిల్లాలలో నియోజకవర్గాల నేతలు కార్యకర్తలే కాకుండా రాష్ట్రంలో నలుమూలల నుంచి పలువురు నాయకులు కూడా అక్కడికి రావడం జరిగింది. వీరితో మాట్లాడడం కూడా జరిగిందట మొదటిసారి తన పైన రాయి దాడి జరిగిన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలతో నేతలు మరింత సంతోషాన్ని తెలియజేస్తున్నారని.. నిజానికి సీఎం జగన్ ఈరోజు సాయంత్రం గుడివాడలో జరిగేటువంటి ఈ రాయి దాడి పైన స్పందించబోతున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: