2024 సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది నామినేషన్ల పర్వం కూడా మొదలయ్యింది.. అయితే ఎన్నికలకు ఒక నెల రోజులు సమయం కూడా లేని సమయంలో ఇంకా పార్టీలు సైతం  మేనిఫెస్టో ప్రకటించకపోవడంతో  అటు కార్యకర్తలు ప్రజలు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా వైసీపీ మేనిఫెస్టో ప్రకటన డేట్ ను ఫిక్స్ చేసినట్లుగా వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న వైసిపి పార్టీకి ప్రజాధరణ చూస్తూ ఉంటే 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ పార్టీని కచ్చితంగా విజయం సాధిస్తుందంటూ వైస్ వి సుబ్బారెడ్డి వెల్లడించారు..



ఉత్తరాంధ్రలో 30 స్థానాలకు పైగా గెలుస్తామని.. మరో రెండు రోజుల్లో వైసీపీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తున్నామంటూ తెలియజేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నామని వెల్లడించారు. సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వారు ప్రతి ఒక్కరు గుండెల్లో కూడా జగన్ ఉన్నారని ఆయన ఉన్నంతకాలం వైఎస్ఆర్సిపి పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు. నర్సిపట్నం కి  సంక్షేమ,అభివృద్ధికి 1700 కోట్లు ఖర్చు చేశామని  తెలియజేశారు.


ఈసారి కనుక మళ్లీ ఎమ్మెల్యేగా పేట్ల ఉమా శంకర్ గణేష్ ని గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను కూడా అందిస్తామంటూ తెలియజేశారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ మేనిఫెస్టో మీద ప్రజలకు భారీ అంచనాలు ఉన్నాయి.. ఈసారి ఎలాగైనా మేనిఫెస్టోలో ప్రకటించే విషయంలో రుణమాఫీ కీలకంగా పోషించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికలలో రుణమాఫీ సాధ్యం కాదని చెప్పినప్పటికీ చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి చేయలేకపోయారు.. మరి ఈసారి ఎన్నికలలో ఇదే విషయాన్ని గుర్తు చేస్తారా లేకపోతే రుణమాఫీ, డ్రాక్రామాఫీ, పెన్షన్ పెంపు వంటి కీలకమైన హామీలను వైసీపీ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటిస్తుందేమో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: