•చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు
•జంపింగే వసంతకు కలిసి వస్తుందా.?
•మైలవరంలో టిడిపికి తిరుగులేదా.?


ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు పార్టీల మధ్య పొత్తులు, జంపింగ్ లు, సీట్ల పంపకాలు, అలకలు, బుజ్జగింపులు ఇలా ఎన్నో వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పరిస్థితి గందరగోళంగా మారింది. ఆరు నెలల నుంచి రాజకీయ నాయకుల మధ్య అసెంబ్లీ సీట్ల గొడవ జరుగుతోంది. ఏ నాయకుడైన తన రాజకీయ భవిష్యత్తు చూసుకొని ఏ పార్టీ అయితే బాగుంటుందో ఆ పార్టీలోకి జంప్ అవుతూ వస్తున్నాడు. అలా ఎంతో మంది నాయకులు వైసీపీ నుంచి టిడిపిలోకి, టిడిపి నుంచి వైసీపీలోకి, అలాగే జనసేన పార్టీలోకి జంప్ అవుతూ వారి వారి నియోజకవర్గాల్లో అసెంబ్లీ సీట్లను పొందారు. అలా జంప్ అయిన వారిలో వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఒకరు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ జంపింగే ఈసారి కలిసి వచ్చేటట్టు కనిపిస్తోంది. మైలవరంలో ఆయన విన్నింగ్ ఖాయమని అంటున్నారు.

రాజకీయాలు:
వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా నందిగామ మండలం  ఐతవరం గ్రామంలో జన్మించాడు. కృష్ణ ప్రసాద్ తండ్రి పేరు నాగేశ్వరరావు, తల్లి పేరు హైమావతి. అలాంటి వసంత  కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1999లో నందిగామ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడారు.  ఆ తర్వాత మరోసారి 2004లో పోటీ చేసి మరోసారి అపజయం  చవిచూశారు. ఆయన ఓడిపోయినా కానీ మంచి లీడర్ గా గుర్తింపు మాత్రం పొందారు. 2005లో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కేడీసీసీ చైర్మన్, జాతీయస్థాయిలో ఆప్కాబ్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.


2014లో తెలుగుదేశం పార్టీలో చేరి అప్పటి టిడిపి అభ్యర్థి తంగిరాల ప్రభాకర్ రావు గెలుపులో కీలకమైన పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఆయన 2018లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి అయినటువంటి దేవినేని ఉమా పై 12వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అలాంటి కృష్ణ ప్రసాద్ ఈ 2024 ఎన్నికల్లో  వైసిపి పార్టీని వదిలి టిడిపిలోకి వచ్చి టికెట్  దక్కించుకున్నారు. అయితే ఈ మైలవరం టికెట్ కోసం దేవినేని ఉమా కూడా చాలా ట్రై చేశారు. కానీ చివరికి చంద్రబాబు, వసంతకు సీటు కేటాయించడంతో వారి మధ్య ఆధిపత్య పోరు ఏర్పడింది. దీంతో చంద్రబాబు   దేవినేని ఉమాను పిలిచి నీకు ఏదో ఒక పదవి ఇస్తాను కలిసి ప్రచారం చేసుకోవాలని, సర్ది చెప్పారు.

బలబలాలు:
మైలవరం నియోజకవర్గంలో  గత కొన్ని సంవత్సరాల నుంచి ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణ ప్రసాద్ లు రాజకీయ ప్రత్యర్థులు. వీరిద్దరు ఎదురుపడితే తప్పనిసరిగా  గొడవ జరిగేది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మనే అంత వైరం ఉండేది. ఇదే తరుణంలో వసంత కృష్ణ ప్రసాద్  టిడిపిలోకి రావడం సీటు దక్కించుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ అంతా  ఒక్కసారి ఆశ్చర్యపోయింది. అంతేకాకుండా వసంతకు తోడుగా దేవినేని ఉమా కూడా  ఆయనతో చేతులు కలపడంతో అక్కడ టిడిపి బలంగా తయారైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో  టిడిపి మొట్టమొదట గెలుచుకునే సీటు ఇదేనని  విజయం ఖరారు అయినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: