ఏపీలో 1వ తారీకు రాగానే ఇంటింటికీ వెళ్లి.. త‌లుపు కొట్టి మ‌రీ అందించే ఏకైక సంక్షేమ కార్య‌క్ర‌మం.. సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల పంపిణీ. ఇది .. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌డం లేదు. తెలంగాణ‌లో కూడా.. ప్ర‌తి నెలా 10వ తారీకు వ‌రకు కూడా.. ల‌బ్ధిదారులు.. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వ‌చ్చి పింఛ‌న్లు తీసుకువె ళ్తున్నారు. కానీ, ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. పింఛ‌న్ల‌ను ఇంటింటికీ పంపించే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.

అయితే.. ఇలా వంటీర్ల ద్వారా జరుగుతున్న పింఛ‌న్ల వెనుక రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయ‌ని.. పింఛ‌న్లు ఇస్తున్న వలంటీర్లు.. వైసీపీ ప్ర‌భత్వానికి అనుకూలంగా ఉన్నారంటూ.. సిటిజ‌న్  ఫ‌ర్ డెమోక్ర‌సీ సంస్థ త‌ర‌ఫున మాజీ ఎన్నిక‌ల రాష్ట్ర క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌.. కేంద్ర ఎన్నిల‌క సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంత‌రం.. దీనిపై కొన్ని ఆదేశాలు వ‌చ్చాయి. అయితే.. గ‌తంలో ఈఆదేశాల‌ను స‌మ‌ర్థించిన‌.. ప్ర‌తిప‌క్ష పార్టీలు.. ఇప్పుడు అవే ఆదేశాల‌ను త‌ప్పుబ‌డుతున్నాయి.

వైసీపీ ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగానే.. పించ‌ను దారుల‌ను ఇబ్బందులు పెడుతోంద‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెప్పారు. ఇంటింటికీ పింఛ‌న్లు పంపిణీ చేయాల్సిందేన‌ని చెబుతున్నారు. కానీ, దీనిలో ఏది వాస్తవం.?  పింఛ‌న్ల పంపిణీ విష‌యంలో వైసీపీ జోక్యం ఎంత‌?  అసలు ఉద్దేశ పూర్వ‌కంగా వైసీపీ చేసింది ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. అస‌లు పింఛన్ల వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకున్న‌దే.. టీడీపీ.ఆ పార్టీనే ఎన్నిక‌ల సంఘానికి తొలుత‌.. కంప్లెయింట్లు చేసింది.

వ‌లంటీర్ల‌పై విమ‌ర్శ‌లు చేసింది. దీనికి తోడు.. సిటిజ‌న్  ఫ‌ర్ డెమోక్ర‌సీ సంస్థక‌లిసి వ‌చ్చి.. ఎన్నిక‌ల సం ఘానికి ఫిర్యాదు చేసింది. అప్ప‌ట్లోనే ఎన్నిక‌ల సంఘం.. ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ చేయాల‌ని స్ప ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. అయితే.. ఈ ఆదేశాల‌కు.. ఏప్రిల్ 1వ తేదీకి మ‌ధ్య గ్యాప్ పెద్ద‌గా లేక‌పోవ‌డంతో బ్యాం కు ఖాతాల్లో వేసేందుకు వీలు కాలేద‌న్న‌ది ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మాట‌. ఇప్పుడు మాత్రం బ్యాంకు ల్లో వేసేందుకు అవ‌కాశం చిక్కింద‌ని చెబుతున్నారు.

దీనిలో వైసీపీ పాత్ర ఏమాత్రం లేదు. అయినా.. విప‌క్షాలు చేస్తున్న వివాదం.. మాత్రం ఇబ్బందిగానే మారింది. దీనికి వైసీపీ ఎదురు దాడి కామ‌న్‌గానే చేసింది. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న ఐదేళ్ల‌లో ఎందుకు ఇంటింటికీ వెళ్లి ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించింది. గ‌తంలో పింఛ‌ను దారులు ప‌డిన ఇబ్బందుల‌ను కూడా.. క‌ళ్ల‌కు క‌ట్టింది. ఈ ప‌రిణామంతో టీడీపీకే ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి త‌ప్ప‌.. వైసీపీకి కాదు. సో.. ఇక‌నైనా ఈవిష‌యాన్ని టీడీపీ వ‌దిలేస్తే.. మేలు జ‌రుగుతుంది త‌ప్ప‌.. లేక‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వు.

మరింత సమాచారం తెలుసుకోండి: