ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో అనంతపురం జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఈ జిల్లా నుంచి ఎన్టీఆర్ తో సహా చాలా మంది మహానీయులు కూడా పోటీ చేసి మరి గెలవడం జరిగింది. మరో కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్న సమయంలో అనంతపురం జిల్లాలోని ఉండేటువంటి నియోజకవర్గం వైసీపీ, టిడిపి, జనసేన, బిజెపి వంటి పార్టీల మధ్య పోటీ ఉన్నది. కానీ అనూహ్యంగా శింగనమల నియోజకవర్గం లో మాత్రం ముక్కోనపు పోటీ ఉండబోతుందట. ఇక్కడ అధికార వైసిపి ,టిడిపి తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తున్నట్లు సమాచారం.


శింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ స్థానం కాబట్టి గత ఎన్నికలలో పరిశీలిస్తే అక్కడ 2004, 2009 లో కాంగ్రెస్ నుంచి మాజీ పీసీసీ చీఫ్ సాకే శైలజనాథ్ గెలవడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా ఈయన పని చేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యింది. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ లోనే ఉంటూ ఆ పార్టీని నడిపిస్తూ ఉన్నారు. ఈసారి శైలజనాథ్ శింగనమల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. వైసీపీ నుంచి మొదటిసారిగా వీరాంజనేయులు నిలబడుతూ ఉండగా..టిడిపి నుంచి బండారు శ్రావణి మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.


అయితే బండారు శ్రావణి కి కూటమి నుంచే సహకరించే పరిస్థితులు ఎక్కువగా కనిపించడం లేదట.గతంలో శింగనమలలో టిడిపి సీనియర్ నాయకులు ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. కానీ శ్రావణిని కొంతమంది టిడిపి నేతల మీద కేసులు పెట్టడంతో ఆమెకు సపోర్ట్ చేయమంటూ వాదిస్తున్నారట. శైలజా నాథ్ రూపంలో టిడిపికి ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. శైలజనాథ్ పరిచయాలు కాంగ్రెస్ పార్టీకే కాకుండా ఇతర పార్టీలలో కూడా బాగానే ఉన్నాయట. ఇప్పుడు ఈ విషయం కాస్త శైలజ నాథ్ కు ప్లస్ గా మారుతున్నది.

శింగనమల నియోజకవర్గం లో శైలజనాథ్ వర్గానికి సంబంధించిన వారు కూడా చాలామంది ఉన్నారట. దీన్ని బట్టి చూస్తే అటు వైసిపి ,టిడిపి పార్టీకి శైలజనాథ్ తలనొప్పిగా మారుతున్నారు. నామినేషన్ వేసిన సందర్భంలో కూడా అటు వైసిపి, టిడిపి కార్యకర్తలు కూడా ఈయనతో సెల్ఫీలు దిగడమే కాకుండా పలకరించడం కూడా జరిగిందట. మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలానే అభివృద్ధి చేసినట్లుగా కూడా పేరు ఉంది. కచ్చితంగా ఓట్లయితే ఇక్కడ చీలుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ముక్కోనపు పోటీలు విజేత ఎవరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: