మే 13 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసాయి. ఎన్నికల అనంతరం ఈ సారి పోయిన సారి కంటే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది. అది వై సీ పీ మీద వ్యతిరేకత వల్లే జరిగింది అని టీ డీ పీ శ్రేణులు అంటూ ఉంటే , అది ప్రస్తుతం అధికారంలో ఉన్న మమ్ముల్ని మరోసారి అధికారం లోకి తీసుకురావడానికి జనాలు మూకుమ్మడిగా వచ్చి ఓట్లు వేశారు అదంతా మాకు కలిసివస్తుంది అని వై సీ పీ శ్రేణులు అంటూ వస్తున్నారు. ఇక ఓట్ల పర్సంటేజ్ విషయంలో మాకు మంచి జరిగింది , అంటే మాకు మంచి జరిగింది అని ఇరు వార్గాలు అంటూ ఉంటే మరో వైపు మాకు ఎక్కువ సీట్లు వస్తాయి అంటే మాకు ఎక్కువ సీట్లు వస్తాయి అని కూడా ఇరు వర్గాలు అంటున్నాయి.

వై సీ పీ పార్టీ కార్యకర్తలు , నేతలు , అభిమానులు అంతా దాదాపు మా పార్టీ కి 120 నుంచి 130 సీట్లు కచ్చితంగా వస్తాయి. 150 వచ్చినా పెద్ద ఆశ్చర్య పడాల్సిన అవసరం ఏమీ లేదు అని విరు గట్టిగా చెబుతూ వస్తున్నారు. ఇక కూటమి కి 120 నుండి 130 సీట్ల వరకు వస్తాయి. టీ డీ పీ పార్టీకి సొంతగా 90 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది అని ఈ పార్టీ అభిమానులు , నేతలు , కార్యకర్తలు చెబుతూ వస్తున్నారు. ఇక ఇలా ఈ ఇరు పార్టీల వ్యక్తులు మేము అధికారంలోకి వస్తాము అంటే మేము అధికారంలోకి వస్తాము అని చెప్తున్నారు.

మరి నిజం గానే ఎవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది. ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే విషయంలో పెద్దగా ఎవరికి క్లారిటీ లేకపోయినా బయటికి వీరంతా గంభీరంగా చెబుతున్నారు. లోపల వీరికి కూడా భయం ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి..? ఎవరు ఈ సారి అధికారం లోకి రాబోతున్నారు ఇలాంటి అన్ని విషయాలు తెలియాలి అంటే రిజల్ట్ డే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap