స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మూడోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. సినిమాల్లో అదిరిపోయే డైలాగ్ లతో మెప్పించిన బాలయ్య అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. బాలయ్యకు రాజకీయ నేతగా కూడా పదేళ్ల అనుభవం ఉంది. 2024 ఎన్నికల్లో సంచలన ఫలితాలతో బాలయ్య సొంత పార్టీనే రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకుంది.
 
అయితే అసెంబ్లీలో బాలయ్య ప్రసంగాలు వినాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. రీల్ సింహం రియల్ సింహం కావాలని బాలయ్య అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే బాలయ్య అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ కావడంతో భవిష్యత్తులో జరిగే సమావేశాలలో తన వాగ్ధాటితో బాలయ్య మెప్పిస్తారా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
 
టీడీపీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసే పథకాల గురించి బాలయ్య మాట్లాడితే చాలని బాలయ్య పవర్ ఫుల్ గా పంచ్ డైలాగ్స్ మాట్లాడితే చూడాలని ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలయ్య సినిమా టైటిల్స్ లో సింహా అని ఉంటే ఆ సినిమా హిట్టని అభిమానులు భావిస్తున్నారు. అసెంబ్లీలో బాలయ్య అదిరిపోయేలా స్పీచ్ ఇస్తే రాజకీయ నేతగా బాలయ్య స్థాయి మరింత పెరుగుతుంది.
 
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా బాలయ్యకు మంత్రి పదవి రాకపోవడం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా భవిష్యత్తులో బాలయ్యకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉండవచ్చని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య తలచుకుంటే కోరుకున్న పదవిని పొందడం మరీ కష్టం అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య వయస్సు 64 సంవత్సరాలు కాగా వయస్సు పెరుగుతున్నా ఈ నందమూరి హీరో తన ఎనర్జీ లెవెల్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.  బాలయ్యకు ప్రాధాన్యత ఉన్న పదవిని చంద్రబాబు ఇస్తే బాగుంటుందని ఏపీ ఓటర్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాల్లో, రాజకీయాల్లో హ్యాట్రిక్ తో బాలయ్య సత్తా చాటి తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: