ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగానే... అధికార తెలుగుదేశం కూటమి వైపు చాలా మంది వైసీపీ నేతలు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. వైసిపి పార్టీ అత్యంత దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న వైసిపి పార్టీ... 2024 వచ్చేసరికి 11 సీట్లు మాత్రమే వచ్చాయి.


దీంతో పార్టీ మొత్తం దివాలా తీసింది. అయితే ఇప్పుడు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలలో.... మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి మాత్రమే కీలకమైన నేతలు. మిగతా నేతలందరూ పెద్దగా జనాలకు పరిచయం   లేని నేతలే ఉన్నారు. దీంతో 11 మంది ఎమ్మెల్యేలలో ఎవరు ఏ పార్టీకి వెళ్తారో అనే ఆందోళన అందరిలోనూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో... వైసిపి పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం కూటమికి దగ్గరవుతున్నారట.


ఎమ్మెల్యే ఎవరో కాదు ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసిపి ఎమ్మెల్యే విరుపాక్షి. గుమ్మనూరు జయరామును కాదని... ఆలూరులో విరూపాక్షి కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. ఆలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. అందుకే కొత్త అభ్యర్థిని పెట్టినా కూడా అక్కడ వైసిపి విజయం సాధించింది. అయితే ఆలూరులో గెలిచిన విరూపాక్షిని తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానాలు వస్తున్నాయట.దీంతో విరుపక్షి కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారట. అయితే ఈ విషయం తెలిసిన జగన్మోహన్ రెడ్డి వెంటనే అతన్ని... తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకున్నారట. పార్టీని వీడకూడదని సర్దు చెప్పారట. దీంతో తాను వైసిపి పార్టీలోనే ఉంటానని విరూపాక్షి తెలిపారు. కానీ ఆయన మనసు మొత్తం... తెలుగుదేశం కూటమి వైపు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాకపోయినా... మరి కొన్ని రోజుల తర్వాత అయినా తెలుగుదేశంలో ఆయన చేరే ఛాన్స్ ఉందట. విరూపాక్షి ఒక్కరే  కాదు మిగతా ఎమ్మెల్యేలు కూడా అదే దారి పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp