*కూటమిగా ఉంటేనే చంద్రబాబుకు బలం
* అదే  కూటమి విచ్ఛిన్నం అయితే టీడీపీ పరిస్థితి ఏంటో ?
*చంద్రబాబు చాణక్య రాజకీయం ఫలిస్తుందా ..?

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే  జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి అద్భుత విజయం సాధించింది.ఏకంగా 164 సీట్లు సాధించి తిరుగులేని విజయం అందుకుంది.నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు.అలాగే డిప్యూటీ సీఎం గా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసారు.రాష్ట్రంలో చంద్రబాబు ఇంతటి ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం కూటమి.గత ఎన్నికలలో కేవలం 23 సీట్లు సాధించిన టీడీపీ ఇటీవల ఎన్నికలలో ఇంతటి ఘనవిజయం సాధించడానికి బలమైన కూటమే కారణమని అందరికి తెలుసు.గత ఎన్నికలలో టీడీపీ ,వైసీపీ ని విమర్శిస్తూ ఒంటరిగా పోటీ చేసిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కేవలం ఒకే ఒక సీటు సాధించింది.అయితే గత ఎన్నికలలో జనసేన పార్టీ సీట్లు సాధించకపోయినా టీడీపీకి  పడే ఓట్లను చీల్చింది.దీనితో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.


వైసీపీ ప్రభుత్వానికి ఈ పరిస్థితి బాగా కలిసి వచ్చి గత ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించింది.అయితే ఓటమికి గల కారణం ఆలస్యం గా గ్రహించిన చంద్రబాబు పవన్ కల్యాణ్ తో పొత్తుకు ముందు నుంచి ఎంతగానో ప్రయత్నించారు.వైసీపీ 151 సీట్లు సాధించి బలంగా వుంది.అంతటి బలమైన పార్టీని గద్దె దించాలంటే టీడీపీ ఒంటరి పోరాటం సరిపోదు అని భావించిన చంద్రబాబు పవన్ కల్యాణ్ తో పొత్తు కుదిరేలా చాణక్య రాజకీయం చేసారు.అప్పటికే జనసేనతో పొత్తులో వున్న బీజేపీ ని కూడా కలుపుకుంటే ఇక తిరుగు ఉండదని ఇరు పార్టీ అధినేతలు భావించారు.అయితే చంద్రబాబు బీజేపీ తో గతంలో మనస్పర్థలు రావడంతో పొత్తుకు ఒప్పుకుంటుందా లేదా అనే అనుమానం కలిగింది.కానీ పవన్ కల్యాణ్ ఈ పొత్తు కుదిరేలా తీవ్ర ఖుషి చేసారు.అయన కృషి మూలంగానే కూటమి ఇంతటి ఘన విజయం సాధించింది.కానీ ఈ ఐదేళ్లలో జనసేనను టీడీపీ కలుపుకుంటూ పోతే ఎలాంటి ఇబ్బంది రాదు.ఒకవేళ టీడీపీ ఆధిపత్యం చేస్తే మాత్రం చరిత్రలో ఘోర ఓటమి తప్పదని అర్ధం చేసుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: