వైసిపి పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి కూడా ఈ సారి ఎలక్షన్లలో మత్స్యకారులకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నాం అని చెప్పుకొచ్చాడు. అందులో భాగంగా పెద్ద ఎత్తున మత్స్యకారుల కు సంబంధించి టికెట్లు ఇస్తున్నట్లు కూడా చెప్పారు. అలాగే ఇచ్చారు. దానితో మొదటి నుండి కూడా ఈ వర్గం ఓట్లు టిడిపి వైపు ఎక్కువ ఉండేవి. అవి అన్ని మా వైపు తిరుగుతాయి అని జగన్ అంచనా వేసినట్లు కనిపించింది. కానీ అది అంతా రివర్స్ అయ్యింది. జగన్ ఓడిపోయిన మోపిది వెంకటరమణ కి ఎమ్మెల్సీ ఇచ్చి , ఆ తర్వాత రాజ్యసభ ఇవ్వడం కూడా జరిగింది.

అలాగే మరో పక్క సిదిరి అప్పలరాజు కి మత్స్యకారుడు అనే కోణంలో పార్టీలో మంచి స్థానాన్ని ఇచ్చారు. కానీ వీటి ద్వారా వైసిపికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. ఎందుకు అంటే వీరిద్దరూ మత్స్యకారు క్యాస్ట్ కు సంబంధించిన వారే కావచ్చు కానీ బాగా డబ్బు ఉన్న వ్యక్తులు. ఇందులో ఒకరు డాక్టర్, మరొకరు పెద్ద వ్యాపారస్తుడు. ఇక నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలకు జనసేన అభ్యర్థి అయినటువంటి బొమ్మిడి నాయకర్ నిజమైన మత్స్యకారుడి వేషంలో అసెంబ్లీకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. నరసాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఈయన నిజమైన మత్స్యకారుడి వేషధారణ అయినటువంటి చాపలు, వల, బుట్ట పట్టుకుని కూడలి నుంచి అసెంబ్లీ ప్రవేశ దారం వరకు నడుచుకుంటూ వచ్చాడు.

దీనితో ఆయనను చూసిన జనాలు మరియు మీడియా ఎవరు ఇతను అని తెలుసుకోవడం మొదలుపెట్టారు. దానితో ఇతను జనసేన పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి అని తెలుసుకున్నారు. ఇక ఆయన ఎందుకు ఇలా వచ్చారు అని ఆరా తీయడం మొదలు పెడితే రాష్ట్రంలో 970 కిలో మీటర్ల తీర ప్రాంతం ఉంది. కానీ సాంప్రదాయ మచ్చ కారుని జీవితం ఎంతో దుర్భరంగా ఉంది. వచ్చే ఐదు సంవత్సరాలు వారికి అండగా ఉంటాను అని చెప్పేందుకే ఇలా వచ్చినట్లు ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: