•పెన్షన్ రూపంలో పక్కదారులు పడుతున్న నిధులు


•అక్రమాలను చంద్రబాబు అరికడతారా ...

•ఆర్థిక  సవాళ్లను బాబు ఎలా అధిగమిస్తారు..



(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )

2014 ఎన్నికల తర్వాత విజయం కోసం దాదాపు ఐదు సంవత్సరాలు ఎదురు చూసిన చంద్రబాబునాయుడు ఎట్టకేలకు కూటమితో పొత్తు పెట్టుకుని అఖండ విజయంతో మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 164 సీట్లు కైవసం చేసుకున్న కూటమి.. తిరుగులేని పార్టీగా రికార్డు సృష్టించింది. అయితే అధికారంలోకి వచ్చారు కానీ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారా లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా టిడిపి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నో పథకాలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకాలను నెరవేర్చాలి అంటే వేలకోట్లతో కూడుకున్న పని.. అంత డబ్బు ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉందా లేదా లేక అప్పులు తీసుకొస్తున్నారా అనే ప్రశ్నలు ప్రజలలో ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు సీఎం పదవికి సంతకం చేసిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ఖజానా మొత్తం కరిగిపోయింది.. గత ప్రభుత్వం ఎన్నో వేలకోట్లు అప్పులు చేసింది.. అవన్నీ తీర్చాలంటే ఇంకా కొన్ని కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది అంటూ తెలిపారు.. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మరొకవైపు వృద్ధాప్య పెన్షన్ , వికలాంగ పెన్షన్తో పాటు తల్లికి వందనం, ప్రతి ఆడబిడ్డకు చేయూతగా ఆర్థిక సహాయం నెలకు రూ.1500,  ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కల్పించాలి అంటే మరింత ఖర్చుతో కూడుకున్న పని.. మరొకవైపు అనర్హులైన వారు పెన్షన్ పొందడమే కాదు ఏకంగా ఒక్కొక్కరు రెండేసి పెన్షన్లను పొందుతూ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ప్రత్యేకించి వికలాంగ పెన్షన్ , వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్ ఇలా రకరకాల పెన్షన్లను ఒకరే రెండు పెన్షన్లను పొందుతూ ఉండడం గమనార్హం. పైగా నిధులను సమకూర్చాల్సిన సమయంలో ఇలా తెలియకుండానే పక్కదారులు పడుతున్నాయి.. ఇప్పటికే 5, 250 మంది పెన్షన్ దారులు రెండు పెన్షన్లు పొందుతున్నట్లు లెక్కలు తేల్చాయి .. ఇలా చాలామంది ప్రభుత్వ సొమ్మును అక్రమంగా దోచుకుంటున్నారు.. మరి  చంద్రబాబు ఈ వీటన్నింటినీ ఒడిసి పట్టుకొని మళ్లీ ప్రభుత్వాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. మరి తన ముందున్న ఇంత పెద్ద సవాల్ ను చంద్రబాబు ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: