అయితే ఇలా తెలుగు రాష్ట్రాలు ప్రకృతి విపత్తుతో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో.. గతంలో ఇలా తెలుగు రాష్ట్రాలను బెంబేలెత్తించిన ప్రకృతి విపత్తుల గురించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారిపోయాయి. అయితే గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీభత్సం సురక్షించింది రెమాల్ తుఫాన్. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఈ తుఫాను సృష్టించిన బీభత్సం అంత ఇంతా కాదు. ఈదురు గాలులు తో కూడిన వర్షం పడటంతో ఎన్నో చోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. ఇలా ఆస్తి నష్టం జరిగింది. భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాలో గాలివాన కురిసింది.
అయితే రెమల్ తుఫాన్ బీభత్సానికి ఏకంగా 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఎన్నో కుటుంబాల్లో ఈ తుఫాను విషాద ఛాయలను నింపింది అని చెప్పాలి. నాగర్ కర్నూల్ జిల్లాలో 8 మంది, షామీర్పేటలో ఈదురుగాలులకు చెట్టు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మియాపూర్ లో వర్షాల దాటికి గోడకూలి మూడేళ్ల బాలుడు మృతి చెందగా, సిద్దిపేట జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఇలా ఈదురు గాలుల కారణంగా చెట్లు నేలకొరిగి, భారీ వర్షాలతో ఏకంగా ఇల్లు, ప్రహరీ గోడలు కూలిపోయి, ఇంకో వైపు ఏకంగా పిడుగుపాటుకు గురై.. ఇలా వివిధ కారణాలతో తుఫాన్ కారణంగా 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఎన్న్నో కుటుంబాల్లో ఈ తుఫాన్ విషాదం నింపింది. అందుకే ఇప్పటికి కూడా ఆయా జిల్లాల ప్రజలు రెమాల్ తుఫాను పేరేత్తితే చాలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ ఉంటారు.