కొన్ని సంవత్సరాల క్రితం టీటీడీలో హిందువులు కాకుండా అన్య మతస్తులు అనేక మంది ఉద్యోగాలలో జాయిన్ అవుతూ వచ్చారు. ఇక ఇది రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కూడా జరగడంతో అనేక మంది రాజశేఖర్ రెడ్డి క్రిస్టియన్ కావడంతో ఆయనే ఇలాంటి పనులు చేయిస్తున్నాడు అనే వార్తలు ఆ సమయంలో బాగా వైరల్ అయ్యాయి. దానితో ఆయన టిటిడి లో హిందువులు కాకుండా అన్య మతస్తులు పని చేయకూడదు అని చట్టాన్ని తీసుకువచ్చారు. ఆయన క్రిస్టియన్ అయినా కూడా ఈ చట్టాన్ని తీసుకువచ్చాడు. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో టీటీడీలో హిందువులు కాకుండా అన్య మతస్తులు ఉద్యోగాలలో జాయిన్ కాకూడదు అని చట్టాన్ని తీసుకు వచ్చిన తర్వాత అన్య మతస్తులు టీటీడీలో ఏ పనిలో జాయిన్ కాకపోయినా అప్పటికే జాయిన్ అయినవారు మాత్రం కొనసాగుతున్నారు.

టీటీడీలో అన్య మతస్తులు ఉద్యోగం చేయకూడదు అని రాజశేఖర్ రెడ్డి చట్టం తీసుకురాక ముందు టీటీడీ కి సంబంధించిన ఉద్యోగాల్లో జాయిన్ అయినా అన్య మతస్తులను ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకురావాలి అనే ప్రయత్నాలను చేసినప్పటికీ అది కొనడం లేదు.  2014 లో చంద్రబాబు టీటీడీలో ఉద్యోగాల్లో ఉన్న అన్య మతస్తులను ప్రభుత్వం ఉద్యోగుల్లోకి తీసుకోవాలి అని ప్రయత్నించిన అనుకున్న అది కుదరలేదు. 2019 లో జగన్ ప్రయత్నించినా కూడా అది కుదరలేదు. దానితో అప్పటికే టీటీడీ ఉద్యోగాల్లో జాయిన్ అయినా అన్య మతస్తులను కొండపై కాకుండా ఇతర ఉద్యోగాల్లో నియమిస్తూ వస్తున్నారు. ఇకపోతే ఎక్కువ శాతం టిటిడి బోర్డు అన్యమతస్తులను కొండపై కాకుండా నాన్ ప్రియారిటి పోస్టుల్లో ఉద్యోగులను భర్తీ చేస్తూ వస్తుంది వస్తూ వస్తుంది.

టిటిడి నాన్ ప్రియారిటీ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం విద్యార్థులయాలు కూడా ఉంటాయి. అందులో భాగంగా తాజాగా పద్మావతి మహిళ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ జీ అసుంతని ని బదిలీ చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి జి అసంతని ని నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తున్నట్లు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఈవో కూడా ఆదేశాలను జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ttd