భారత్, పాక్ యుద్ధం చేయబోతున్నారని తెలిసినప్పటి నుంచి పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం చేయడానికి సిద్ధంగానే ఉన్నామంటు గంభీరంగా చెప్పుకున్న కానీ పాకిస్తాన్ లోపల పరిస్థితి చెబితే అందుకు భిన్నంగా ఉన్నది..భారతదేశం అనే శత్రువు ఎదురుగుండా ఉంది వర్గ శత్రుత్వం , మతపరమైనటువంటి విద్వేషం ఇండియాతో ఉన్నది కాబట్టి.. భారత్ ను ఎలాగైనా నాశనం చేయాలనే సుదీర్ఘ కాలపు కళ నెరవేర్చుకోవడం కోసం పాకిస్తాన్ సిద్ధపడుతూ ఉంటే.. అందుకోసం కాశ్మీర్లో ఒక అలజడి సృష్టిస్తే అందుకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి చైనా మరొక పక్క టర్కీ వంటివి ఉన్నాయి కాబట్టి ఇక తిరుగులేదు. వాళ్ళిద్దరి ఆయుధాలతో ఒక విధ్వంసమే చేయవచ్చు భారత్ పైన అని పాకిస్తాన్ సిద్ధమవుతున్న తరుణంలో కానీ పాకిస్తాన్లోనే కొన్ని అలజడులు కనిపిస్తున్నాయి.


ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ అనుచరులు రోడ్డు మీద కొట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.. ఒకపక్క ఇదొక అయోమయం వీటిని ఎలా కంట్రోల్ చేయాలి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ రాజీనామాలు చేస్తున్నటువంటి సైన్యం మరొకవైపు, మరొకవైపు తమ పాకిస్తాన్ లో ఉన్నటువంటి తమ ఆస్తులను బంగారాలు, వజ్రాలు ఇలాంటివి తమ భార్యలకు, భార్య పిల్లలకు ఇచ్చేసి మరి విదేశాలకు పంపిస్తూ ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్య అధికారులు మరొకవైపు.. అంతలోనే బెలూత్ ట్రబుల్స్ వచ్చి బాదుతున్న మరొకవైపు.. మరొకవైపు గిల్లిట్ బల్టిస్తాన్  తహరికి తాలిబాన్స్  పాకిస్తాన్లో వచ్చి పాకిస్తాన్ సైన్యాన్ని పట్టుకెళ్ళి నిర్బంధించి చూసుకుందామంటూ హెచ్చరిస్తున్నారు.


సింధు అలాగే పంజాబ్ రైతుల మధ్య గొడవలు మరొకవైపు.. ఇన్ని గందరగోళాల మధ్యన అసలు ఏం చేస్తోంది? ఏం జరుగుతోంది? ఏమవుతుందో అర్థం కావట్లేదు పాకిస్తాన్ కి. మరొకవైపు భారత్ వెళ్లి అక్కడ ఐఎంఎఫ్ లో ఆపేద్దామని చూస్తోంది.. లేకపోతే ఏటిఎఫ్ లో మళ్లీ పెట్టేద్దామని చూస్తోంది.. మరొకవైపు అమెరికా వంటి దేశాలు భారత్ కు అండగా ఉంటూ.. పాకిస్తాన్ వంటి వాటి మీద యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నారు. అక్కడ తీవ్రవాదులేమో వాళ్ళ మాట వినరు.. తీవ్రవాదులు బహిరంగంగానే తిరుగుతాం అంటున్నారు. వాళ్లు తిరిగితే భారత్ వాళ్లని కచ్చితంగా వేసేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతమైతే ఇలా మొత్తం అంతా గందరగోళం మధ్య ఉంది పాకిస్తాన్ పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: