
ట్రంప్ ఒక్క ఫోన్ కాల్ చేసి యుద్ధం ఆపేయమనగాని ఎందుకు ఆపేశాడు ..? ఇలా సోషల్ మీడియాలో రకరకాలుగా నరేంద్ర మోడీ పై విరుచుకుపడుతున్నారు జనాలు . ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని అప్పుడే మరచిపోయారా నరేంద్ర మోడీ గారు అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . నిజానికి ఇండియా - పాకిస్తాన్ వార్ జరుగుతున్న ప్రతి సమయంలోనూ పాకిస్తాన్ మిస్సైల్స్ ని పాకిస్తాన్ డ్రోన్ లని తుక్కుతుక్కు చేసింది భారత్ ఆర్మీ . నిజంగా ఇండియా - పాకిస్తాన్ మధ్య వార్ జరిగితే పాకిస్తాన్ దేశం అల్ల కల్లోలంగా తయారై ఉండేది .
ఇప్పటికే ఫైనాన్షియల్ గా భారీ నష్టాన్ని చూసింది పాకిస్తాన్ . సరిగ్గా ఇంకొక వారం రోజులు గాని యుద్ధం చేసుంటే అసలు పాకిస్తాన్ అని పీడ ఇండియాకి విరగడయిపోయేది . మరి ఎందుకు ట్రంప్ ఫోన్ చేసి చేయగానే నరేంద్ర మోడీ వెనక్కి ఇండియన్ ఆర్మీ ని కంట్రోల్ చేసే కాల్పుల విరమణ తీసుకొచ్చారు అంటూ జనాలు ప్రధాని నరేంద్ర మోడీపై మండిపడుతున్నారు . అయితే చాలామంది నరేంద్ర మోడీ తీసుకున్న డెసిషన్ ని స్వాగతిస్తుంటే మరి కొంత మంది మాత్రం నరేంద్ర మోడీ తప్పు చేశారని ..ట్రంప్ చెప్పిన మాట వినకుండా ఉండాల్సింది అని ..పెహలగంలో జరిగిన అటాక్ ఎప్పటికీ భారతీయులు మర్చిపోరు అని .. కానీ నరేంద్ర మోడీ ఎంత ఈజీగా అటాక్ గురించి మర్చిపోయాడు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!