పాకిస్తాన్లో ఉండే ఉగ్ర స్థావరాలను సైతం ఇండియన్ ఆర్మీ  ఇటీవలే ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.. ఈ దాడీలో పాకిస్థాన్ కు భారీ నష్టం కూడా జరిగింది. అయితే భారత్ చేపట్టిన సిందూర్ ఆపరేషన్ వల్ల పాకిస్తాన్ కు చాలా నష్టం జరిగిందని  తాజాగా అధికారుల బయటపెట్టారు. ఈ దాడులలో 11 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా తెలియజేసింది. అలాగే 78 మంది సైనికులకు గాయాలైనట్లుగా తెలియజేశారు.

వీటికి తోడు ఈ ఆపరేషన్లో 40 మంది పౌరులు కూడా మరణించారని మరో 121 మందికి గాయాలు అయ్యాయని పాకిస్తాన్ సైనిక అధికారి ఎస్పీఆర్ తాజాగా ఈ విషయాలను తెలియజేశారు. అలాగే ఈ దాడులలో మరణించిన పాకిస్తాన్ సైనికుల పేర్లను కూడా తెలియజేసింది. కాని భారత్ మాత్రం సిందూర్ ఆపరేషన్ వల్ల 40 మంది పాకిస్తాన్ సైనికులు మరణించి ఉంటారని భారత ఆర్మీ ఇటీవలే తెలియజేయగా అలాగే 100 మంది ఉగ్రవాదులు కూడా మట్టుపెట్టామంటూ తెలియజేశారు. ఉగ్రవాద స్థావరాలు కూడా నేలమట్టమయ్యాయని కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఉగ్రవాదుల నాయకుడు కుటుంబాలను కూడా నాశనం చేసామని తెలియజేశారు.



తాజాగా దక్షిణ జమ్మూ కాశ్మీర్లో ఎదురు కాల్పులు జరపగా.. ఉగ్రవాదులు, భద్రత దళాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లలో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతమైతే ఉగ్రవాదులు ,భద్రత దళాల మధ్య కాల్పులు అయితే  జరుగుతున్నాయట. మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా భద్రతా దళాలకు చిక్కినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్, భారత్ కాల్పుల విరమణ చేసుకున్నప్పటికీ అక్కడక్కడ పాకిస్తాన్ తన వక్ర బుద్ధితో ఏదో ఒక రూపంలో కాల్పులు జరపడే కాకుండా డ్రోన్లు ఎగిరేయడం వంటివి చేస్తూ ఉన్నది. అయితే ఇలాంటివి చేస్తే కనుక కచ్చితంగా మరింత తగిన బుద్ధి చెబుతామంటూ ఇండియన్ ఆర్మీ తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: