గత రెండు మూడు రోజుల నుంచి ప్రముఖ యూట్యూబ్ జ్యోతి మల్హోత్రాపైన పలు రకాల విషయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈమె పాకిస్తాన్ గూఢచారి అంటూ పలు రకాల ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ యూట్యూబర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో భాగంగా విచారణ కూడా చేపడుతూ అధికారులు పలు కీలకమైన విషయాలను రాబడుతున్నారు. జ్యోతి ఒక అస్త్రంగా ఉపయోగించుకొని పాకిస్తాన్ ఐఏఎస్ ఏజెంట్లు ఈమెను తమ వైపుగా మలుచుకున్నట్లు పోలీసులు గుర్తించారట. ఇటివలె జరిగిన సిందూర ఆపరేషన్ సమయంలో ఢిల్లీలోని పార్క్ రాయబార కార్యాలయంలో ఒక అధికారితో ఈమె టచ్ లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారట.



జ్యోతి మల్హోత్రా సైనిక లేదా రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా వారితో షేర్ చేసుకుందని ప్రస్తుతం ఏ దశలో ఉందనేది చెప్పలేము కానీ పాకిస్తాన్ నిగా వర్గాలతో ఈమె నేరుగా సంప్రదింపులు జరిపిందని తెలుపుతున్నారు. ఈమెను వారు ఒక అస్త్రంగా చేసుకున్నారని ఖచ్చితంగా చెప్పగలము అంటూ అధికారులు తెలుపుతున్నారు. జ్యోతి మరి కొంతమంది యూట్యూబర్స్ తో చాలా సన్నిహితంగా ఉన్నట్లు తెలియజేశారు. వీరు కూడా పి.ఐ.ఓ లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని తెలియజేశారు.


ఇలా చేయడం కూడా ఒక రకమైన యుద్ధమేనని ఇన్ఫ్లుయర్స్ ను ఉపయోగించుకుంటూ వారికి సంబంధించిన విషయాలను రాబట్టుకోవడమే పాకిస్తాన్ చేస్తున్న పని అంటూ అధికారులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా జ్యోతి పాకిస్తాన్ లో ఎన్నోసార్లు పర్యటించిందని ఒకసారి చైనాకు కూడా వెళ్లినట్లు అధికారులు పోలీస్ విచారణలో తెలియజేశారు. ఇటీవలే బహిష్కరణకు గురైన ఫాక్ అధికారితో కూడా ఈమె టచ్ లో ఉందని , అక్కడి నుంచి ఆర్థిక లావాదేవీలు ప్రయాణ వివరాలను కూడా విశ్లేషిస్తున్నామని ఈ విశ్లేషణ.. జ్యోతి ప్రయాణం ఎక్కడి వరకు వెళ్లిందని విషయంపై ఆరా తీస్తున్నామని.. ఆమె ల్యాప్టాప్ తో సహా ఎలక్ట్రిక్ పరికరాలు అన్నిటి పైన ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషిస్తున్నారని తెలుపుతున్నారు. పూర్తి సమాచారం అప్పుడు బయటపడుతుందని తెలుపుతున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: