
ఎప్పటిలాగే విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు అన్ని టెక్నికల్ ఇష్యూస్ చెక్ చేసుకున్నాకే రన్వే నుంచి టెకాఫ్ అయింది ఏఐ 171 విమానం. అయితే రన్వే నుంచి టెక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ప్రమాదానికి గురైంది . మేఘాని నగర్ గోడసర్ క్యాంప్ ప్రాంతాలయంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భారీ ఎత్తున పేలుడు శబ్దం అలాగే దట్టమైన పొగ అల్లుకునేసింది. ఈ పొగ అన్ని వైపులకు వ్యాపించేసింది . సుమారు విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక లోపం కారణంగానే విమాన, కింద పడిపోయినట్లు జాతీయ మీడియా చెప్తుంది.
టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఫ్లైట్ కొంచెం కొంచెంగా గా కిందకి వాళిపోతూ సరిగ్గా 1:30 సమయంలో పూర్తిగా దిగిపోయి చెట్టును ఢీకొనేసింది అని ఆ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన విమానం వైట్ బాడీ బోరింగ్ 787 డ్రీమ్ లైనర్ . అంతేకాదు ఈ విమానంలో సుమారు 300 మంది ప్రయాణించవచ్చు . అంతేకాదు సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిపోయింది అంటున్నారు అధికారులు .
విమానం కూలిపోయింది అనే విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు . ఈ ఫ్లైట్లో గుజరాత్ మాజీ సీఎం విజయ రూపాని కూడా ఉన్నారు . అంతేకాదు ప్రమాద విషయం తెలుసుకోగానే కేంద్ర పౌర విమానాయాల శాఖ మంత్రి కే రామ్మోహన్ ఘటన స్థలానికి బయలుదేరారు . అంతేకాదు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు . ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితి మొత్తం తనకు తెలియజేయాలి అని ఆర్డర్ వేశారు .
అంతేకాదు ఈ ప్రమాదం పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది . విమానానికి కెప్టెన్లుగా ఉన్న సుమిత్ సబర్వాల్ అలాగే ఫస్ట్ ఆఫీసర్ గా క్లైవ్ కుందల్ వ్యవహరించినట్లు తెలిపారు. సుమిత్ కి ఎల్ టి సి గా 8200 గంటలు అలాగే కోపైలెట్ 1100 గంటల అభుభవం ఉన్నట్లు కూడా వెల్లడించింది . ఈ విమానం రన్వే 23 నుంచి గాల్లోకి ఎగిరినట్లు కూడా తెలిపింది . కొద్దిసేపటికి ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏటీసీకి అత్యవసర కాల్ వచ్చిందని కూడా వెల్లడించింది . పరిస్థితి క్లియర్ చేసే లోపే విమానం కుప్ప కోల్పోయినట్లు పేర్కొంది . మరోవైపు ఎయిర్ ఇండియా కూడా ఎక్స్ వేదికగా ప్రమాదాన్ని అఫీషియల్ గా దృవీకరించింది.