
కానీ ఆ సిట్యువేషన్ చూసిన వారందరూ కూడా రమేష్ ఎలా బతికారు అనే విషయమే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా విశ్వాస్ చిన్నచిన్న గాయాలతో బయటపడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా హాస్పిటల్ విమానంలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకోవడానికి ఒక మీడియా మిత్రులు వెళ్లగా విమాన ప్రధమాదం నుంచి తాను ఎలా బ్రతికి బయటపడ్డానో తెలియదంటూ తెలియజేస్తున్నాడు రమేష్ విశ్వాస్.. అలా తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ టేకఫ్ అయినా 30 సెకండ్ల తర్వాత విమానం పెద్ద శబ్దంతో కూలిపోయిందని తను సృహలోకి వచ్చేసరికి చుట్టూ మృతదేహాలు పడి ఉన్నాయని తెలిపారు. విమానం ముక్కలుగా విరిగిపోయి చెల్లాచెదురుగా ఉందని ఎవరో తనని అంబులెన్స్ లోకి ఎక్కించారని అంతేకాకుండా తన సోదరుడు కూడా విమానంలో ప్రయాణించాడంటూ తెలియజేశారు రమేష్.
ఎమర్జెన్సీ గేట్ ని తీసుకొని రమేష్ బయటికి వచ్చారని కొంతమంది తెలుపుతూ ఉండగా మరి కొంతమంది అది సాధ్యమయ్యే పని కాదు అంటూ తెలిపారు. విమానం కూలిపోయే సమయంలో బయటికి దూకే అవకాశం కూడా లేదని మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు అసలు రమేష్ ఎలా తప్పించుకున్నారనే విషయం పై ఖచ్చితమైన సమాచారం లేదని కూడా వెల్లడిస్తున్నారు. మొత్తానికి రమేష్ బయటపడడం కూడా ఒక మిస్టరీ గానీ మిగిలిపోయింది. కానీ తన సోదరుడు మాత్రం ఈ ప్రమాదంలో మరణించారని తెలిపారు.