
కానీ ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు మృతుల సంఖ్య 274 చేరిందని.. ఫ్లైట్లో 241 మంది మృతి చెందగా బిజీ మెడికల్ కాలేజీకి సంబంధించి 33 మంది మరణించారట. మరి కొంతమంది క్షతగాత్రులను కూడా ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో 26 మంది మెడికోలు మరణించగా.. చికిత్స పొందుతూ 9 మంది మృతి చెందినట్లుగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలుపుతున్నారు. సుమారుగా 50 మంది వరకు వైద్య విద్యార్థులు మరణించారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
వీటికి తోడు అనేక మంది గాయపడినట్లుగా అక్కడి స్థానిక మీడియా తెలియజేస్తోంది. ప్రస్తుతం కళాశాల నడుస్తూ ఉండడమే కాకుండా ప్రమాదం భోజన సమయంలో జరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ విమానం కూలిన కొన్ని కిలోమీటర్ల వరకు వసతి గృహాలు దెబ్బతిన్నాయని తెలియజేస్తున్నారు. ఇవి మన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు టాటా ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ప్రకటించారు. ఇక మరణించిన కుటుంబాల నుంచి ఒక్కొక్కరు ఒక్కో విధంగా దీనగాథను తెలియజేస్తున్నారు. మరి మృతుల సంఖ్య పై గుజరాత్ ప్రభుత్వం ఎలాంటి అధికారికంగా సమాచారం వెల్లడిస్తుందని విషయంపై ఎదురుచూస్తున్నారు.