
నేతలు తమ మాటలతో ప్రజల్ని మోసం చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. నేతలు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదు. నాయకుల దొంగ మాటలు పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణాలో తెలంగాణ నేతలే పాలకులుగా ఉన్నా నేతలపై వ్యతిరేకత మాత్రం కొనసాగుతోంది. అప్పుడు రాజకీయాల్లో ఉన్న నేతలే ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతుండటం గమనార్హం.
ప్రస్తుతం బనకచర్ల ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకురావడం కూడా ఆంధ్ర తెలంగాణ నేతల గేమ్ ప్లాన్ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రజలను నేతలు ఎమోషనల్ గా మోసం చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొత్త ప్రాజెక్ట్ లను తెరపైకి తెస్తున్నారు. మొదలుపెట్టిన ప్రాజెక్ట్ లకు దిక్కు లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
బనకచర్ల ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకురావడం వల్ల ప్రజలకు ప్రస్తుతం ఒరిగేది లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ చేపడితే తెలంగాణకు 200 టీఎంసీల జలాలివ్వాలని విశ్రాంత ఇంజనీర్ల సంఘం రెండు ప్రతిపాదనలు పంపింది. ఇంకా మొదలు కానీ ప్రాజెక్ట్ కు రాద్ధాంతం ఎందుకని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. బనకచర్ల ప్రాజెక్ట్ వివాదానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు