
అయితే ప్రధాని మోదీ , హోం మంత్రి అమిత్ షా ఈసారి మాత్రం మహిళలకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది .. త్వరలోనే జనగణన జరుగునుంది .. ఆ తర్వాత మహిళా బిల్లు అమల్లోకి రానుంది .. ఇలాంటి సమయంలో మహిళను అధ్యక్షురాలిగా పెడితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి ప్లస్ అవుతుందన్న భావనకి వారు వస్తున్నారు .. అది కూడా ప్రధానంగా దక్షిణాది ప్రాంత నేతలకు ఈ అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో గట్టి కసరత్తు చేస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు అంటున్నాయి .
ఇలా దక్షిణాది నుంచి బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ రాగలిగే స్థాయి ఉన్న మహిళ నేతలు కొద్దిమంది మాత్రమే ఉన్నారు .. ఆంధ్రప్రదేశ్ నుంచి పురందేశ్వరి, తమిళనాడుకు చెందిన ఆర్థిక మంత్రి నిర్మాణ సీతారామన్, వానాతి శ్రీనివాసన్ పేర్లు అధికంగా అధ్యక్ష పదవి రేసులో వినిపిస్తున్నాయి .. ప్రధానమంత్రి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు .. ఆయన తిరిగి దేశానికి వచ్చిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకోనన్నారు .. బీజేపీ హై కమాండ్ ఎప్పుడూ చిన్న హింటు కూడా ఇవ్వరు .. ఎవరికీ తెలియని , అలాగే ప్రచారంలోకి వచ్చిన పేర్లు చాలా తక్కువ సార్లే పదవులకు ఎంపిక అవుతాయి . ఇక మరి ఈసారి ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది .