
నారా లోకేష్ తన ట్విట్టర్ నుంచి ఇలా రాసుకోస్తూ.."మా పవన్ అన్న సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు.. పవన్ కళ్యాణ్ అభిమానులు లాగే తాను కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ చాలా ఎదురు చూస్తున్నాను.. పవన్ అన్న సినిమాలు, ఆయన స్వాగ్ అంటే చాలా ఇష్టం అంటూ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. హరిహర వీరమల్లు సినిమా అద్భుతమైన విజయాన్ని కోరుకోవాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది".
రాజకీయాల పరంగా కూడా కూటమిలో భాగంగా అటు జనసేన, బిజెపి ,టిడిపి పార్టీ మూకుమ్మడిగానే కలిసి ఉన్నారు.. మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య మంచి స్నేహబంధం ఉందని ఎన్నోసార్లు నిరూపించారు నారా లోకేష్. ఇప్పుడు మరొకసారి కూడా ఇలా విషెస్ తెలియజేయడంతో ప్రతి ఒక్కరు నారా లోకేష్ ని అభినందిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ కోసం ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. పొలిటికల్ గా బిజీగా ఉండడం చేత సినిమా షూటింగులకు పాల్గొనలేక పోతున్నానని అందుకే ఇకమీదట సినిమాలు చేస్తానో లేదో తెలియదు అంటూ కూడా తెలిపారు పవన్ కళ్యాణ్.