ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని ఎక్కడపడితే అక్కడ లభిస్తోందని ముఖ్యంగా కాలేజీలలో ఈ వ్యాపారం ఎక్కువగా జరుగుతోందనే ఆరోపణలు రోజురోజుకీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన ఏపీ ప్రభుత్వం, పోలీసులు చర్యలు చేపడుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఒక ఎస్సై పై టీడీపీ ఎమ్మెల్యే పలు సంచలన ఆరోపణలు చేయడం ఆంధ్రప్రదేశ్ అంతట హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. తిరువూరు ఎస్సై సత్యనారాయణ పై ఆరోపణలు చేస్తున్నారు.


తిరువూరు ఎస్సై ఒక గ్యాంగుని పెట్టుకొని మరి గంజాయి అమ్మే, కొనే వారి వద్ద నుంచి భారీగా డబ్బులు తీసుకుంటున్నారంటూ టిడిపి ఎమ్మెల్యే సంచల ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తిరువూరు స్టేషన్లో ఎస్సై ప్రైవేటు పంచాయతీలను కూడా చేస్తూ అక్రమ వసూలు చేస్తున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఎమ్మెల్యే వెల్లడించారు. పోలీసులే ఇలాంటి గంజాయి అమ్మకాలు చేస్తూ ఉంటే ఈ పద్ధతి సరైనది కాదు అంటూ ఎమ్మెల్యే కొలికపూడి తెలిపారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పనులు చేసి దొరికిపోయిన వారందరినీ పిలిచి మరి ఇప్పుడు గంజాయి అమ్మి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారంటూ టిడిపి ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు.


అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇలాంటి ఆరోపణలు చేయడంతో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. అధికార ప్రభుత్వంలో భాగమైన ఎమ్మెల్యేలు అధికార ప్రభుత్వం పైన ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటి అంటూ నేతలు, కార్యకర్తలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అధికారులు, నేతలు ఒకే మాట పైన ఉంటూ సుపరిపాలనను కొనసాగించాలంటూ సూచిస్తున్నారు. ఈ విషయంపై అటు పోలీసులు ఉన్నత అధికారులు కూడా స్పందిస్తున్నారట. ఇందుకు సంబంధించి ఈ విషయంలో వాస్తవాల పైన కూడా దర్యాప్తు చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. లేకపోతే సమాజంలో చెడు సంకేతాలకు వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు తెలుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: