
కర్ణాటక లోని హోలేనరిసిపుర ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణ కుమారుడు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అంటే తెలియని వారు ఉండరు. ఈయన రాజకీయాల కంటే ఎక్కువగా లైంగిక అత్యాచార వేధింపుల వల్లే ఎక్కువ వార్తల్లో నిలిచారు. గత 14 నెలల ముందు ప్రజ్వల్ రేవణ్ణ పై ఆయన ఫామ్ హౌస్ లో పనిచేసే 47 ఏళ్ల పనిమనిషి రేప్ కేస్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే.అప్పట్లో ఈ విషయం దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కర్ణాటకలో లోక్సభ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత రోజే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈయన పై రేప్ కేసు పెట్టిన పనిమనిషి మాత్రమే కాకుండా చాలామంది అమ్మాయిలు జీవితాలతో ప్రజ్వల్ రేవణ్ణ ఆడుకున్నాడని, దానికి సంబంధించిన వీడియోలు కూడా పెన్ డ్రైవ్ లో ఉన్నట్టు గుర్తించారు.