తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు అమలు పరచాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది.. ఇప్పటికే. రాష్ట్రంలో ఉన్న నేతలంతా ఢిల్లీకి చేరుకొని వారి గళాన్ని వినిపిస్తున్నారు. 42 శాతం బీసీ బిల్లును అమలు పరచాలని కోరుతున్నారు. దీనికి ప్రధాన నాయకత్వంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇదే బీసీ బిల్లు అమలు చేయాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారు తప్ప ఆచరణలో మాత్రం విఫలమవుతున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. మోడీని గద్దదించే మహాశక్తివంతుడు రేవంత్ రెడ్డి అంటూ కొంతమంది అంటున్నారు. మోడీని దించి రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేయగల సత్తా ఆయనకు ఉందంటున్నారు. అంత సత్తా రేవంత్ రెడ్డికి ఉంటే మంచిదే కానీ బిసి అనే ఒక అస్త్రాన్ని మోడీపై ఎక్కు పెడుతున్నారు.

బీసీ బిల్లును అమలు చేయాల్సింది కేంద్రం, తప్పకుండా ఇందులో మాకు సాయం చేయాల్సిందే అని కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో చెబుతున్నారు. ఒకవేళ ఇది అమలు చేయకపోతే నరేంద్ర మోడీని దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని అంటున్నారు. కట్ చేస్తే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు  అసలు రేవంత్ రెడ్డి సీఎం ఆ పదవిలో ఉండొద్దు. ఆ పదవిని మహేష్ కుమార్ గౌడ్ కి అప్పజెప్పాలి. 6-7 శాతం ఉన్నటువంటి రెడ్డిలు పరిపాలనలో ఉండి బీసీ రిజర్వేషన్ అని కొట్లాడటం కాస్త విడ్డూరంగా ఉంది. ముందుగా బీసీ లకు పెద్దపీట వేసి వారిని అన్ని పదవుల్లో కూర్చోబెట్టి 42 శాతం రిజర్వేషన్ రాష్ట్రంలో అమలయ్యేలా  కాంగ్రెస్ ప్రయత్నం చేసి, ఈ బిల్లు కోసం కొట్లాడితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ బీసీ బిడ్డ. తనకి తాను బ్రాహ్మణ అని చెప్పుకునే రాహుల్ గాంధీ  మళ్లీ ఎలా ప్రధానిని చేస్తారంటూ అడుగుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పేరుకే రిజర్వేషన్లు అంటూ హంగామా చేస్తున్నారు. కానీ లోలోపల మాత్రం రాజ్యపాలన చేసేది రెడ్లు, దొరలు, బ్రాహ్మణులూ అని వాళ్ళు చాటి చెబుతున్నారు. దాదాపు 50 సంవత్సరాలకి పైగా దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి సమయంలో వీళ్లకు బీసీలు కనబడలేదా.. అప్పుడే బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తే బాగుండేది కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే వీరు పైకి ప్రజలను పిచ్చివాళ్లను చేయడానికి మాత్రమే బీసీ రిజర్వేషన్ అని చెబుతున్నారు తప్ప లోపల మాత్రం అది అమలు కాకుంటే బాగుంటుందనేది వారి యొక్క వాదన అన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: