తరచూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయి.ఇక భూకంపాలకు పుట్టినిల్లుగా జపాన్ అని చెప్పుకుంటారు. ఎందుకంటే జపాన్ లో తరచూ భూకంపాలు వస్తూ లక్షల కోట్ల ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. అలాగే ఇండోనేషియా,చైనా వంటి దేశాలలో కూడా ఈ భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుంది.తాజాగా ఈ మూడు దేశాల్లో కాకుండా మరో దేశంలో భారీ భూకంపం సంభవించడమే కాదు సునామి హెచ్చరికను కూడా జారీ చేశారు.


మరి ఆ దేశం ఏంటో కాదు చిలీ.. ఈ చిలీ దేశం దక్షిణ అమెరికా ఖండంలోని పసిఫిక్ మహాసముద్రం అంచుల వెంబడి ఉండే ఒక పొడవైన దేశం. మన ప్రపంచంలో 80 శాతానికి పైగా పెద్ద పెద్ద భూకంపాలు అన్ని పసిఫిక్ మహాసముద్రం అంచుల చుట్టూ ఉన్న దేశాలలోనే సంభవిస్తాయట. ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ప్రాంతాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ ప్లేట్ చుట్టుపక్కల ఉన్న ఇతర టెక్టోనిక్ ప్లేట్లు క్రిందకు దిగజారి పోవడం వల్ల ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయట. అందుకే పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న  ప్రాంతాలలోనే సంభవిస్తాయి. అలా చిలీ దేశంలోనే డ్రీక్ పాసేజ్ లో ఆగస్టు 21 అర్ధరాత్రి 9:16 గంటలకి భారీ భూకంపం సంభవించింది. చిలీ దేశానికి సమీపంలో ఉండే డ్రీక్ పాసేజ్ లో రాత్రిపూట భూమి కంపించిందట.


అంతే కాదు రిక్టార్ స్కేల్ పై దీని తీవ్రత 7.5 గా నమోదవ్వడంతో అక్కడి ప్రజలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. భూ ఉపరితలానికి 11 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు అక్కడి జియో లాజికల్ సర్వే వారు. ఈ ప్రకంపనాల దాటికి  సునామి ముప్పు పొంచి ఉంటుందంటూ చీలి దేశం ఒక్కసారిగా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ డ్రిక్ పాసేజ్  అనేది దక్షిణ అమెరికా అంటార్కిక మధ్య ఒక జలవనరుగా ఉన్నదట. పసిఫిక్ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపం అంటూ అక్కడ నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: