
తేజ సజ్జా బర్త్డే కానుకగా తన తదుపరి చిత్రాలను కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మిరాయ్ సినిమా తెరకెక్కిస్తున్న పీపుల్ మీడియా మరో సినిమాని తేజ సజ్జా తో చేయబోతున్నట్లు ప్రకటించారు. రాయలసీమ వరల్డ్ అంటూ ప్రకటించిన మేకర్స్ అయితే ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరు ? అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అనే విషయం మాత్రం చెప్పలేదు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం పీపుల్ మీడియా చేస్తున్న ఈ సినిమా జాంబిరెడ్డి సినిమాకి సీక్వెల్ అన్నట్లుగా వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో 2021 లో ఈ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అప్పటినుంచి ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో వస్తున్న సినిమాలు సూపర్ హిట్టుగా నిలిచాయి. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గానే జాంబి రెడ్డి-2 తీసుకురాబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్స్ ని కూడా భారీ బడ్జెట్లోనే తెరకెక్కించేలా ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి కూడా ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నారని ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి జాంబిరెడ్డి సినిమాని మించి ఈసారి ఈ చిత్రం ఉండేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రం జాంబిరెడ్డి 2 నో కాదో తెలియాల్సి ఉంది.