సనాతన ధర్మం అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు చాలామందికి నచ్చడం లేదు. ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ పై సనాతన ధర్మం పేరు తీస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సిపిఐ నారాయణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడే మాటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ఈ ఇష్యూలోకి పవన్ కళ్యాణ్ భార్యని కూడా లాగడంతో ఇది కాస్త రచ్చకు దారి తీసింది.సిపిఐ నారాయణ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటూ పట్టుకు తిరిగే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మంలో ఉందా.. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి మూడో భార్యతో ఉంటున్నారు ఇది సనాతర ధర్మంలో భాగమేనా.. 

పూటకో మాట మాట్లాడుతూ రంగులు మార్చే ఊసరవెల్లి పవన్ కళ్యాణ్ ఈయన పెద్ద బఫూన్.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమితో కలిసి తమ స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారు. బిజెపి 2014లో చంద్రబాబును ఓడించి చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. కానీ అలాంటి బీజేపీతో చంద్రబాబు మళ్ళీ ఎలా పొత్తు పెట్టుకున్నారో.పవన్ కళ్యాణ్ పొద్దున లేస్తే చేగువేరా అంటాడు.. మధ్యాహ్నమేమో సనాతన ధర్మం..రాత్రికేమో గుండు పట్టుకొని పోతా ఉంటాడు పవన్ బఫూన్ బడవ.. సనాతన ధర్మం సనాతన ధర్మం అంటూ పవన్ చెప్పుకుంటూ తిరుగుతున్నావు కదా.. సనాతన ధర్మం ప్రకారం.. నువ్వు చస్తే నీ భార్య కూడా నీతో కలిసి మంటల్లో తగలబడుతుందా..

నువ్వు చస్తే నీ భార్య నీ చితిలో కలుస్తుంది అని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా.. ఇలాంటి చట్టాలను బ్రిటిష్ ప్రభుత్వమే ఎత్తివేసింది.. జంతువు కైనా ఒక పాలసీ ఉంటుంది కానీ నీకు అది కూడా లేదు.. అసలు నిన్ను మనిషి అనాలా.. జంతువు అనాలా..అసలు వీడు దేనికి పనికిరాడు అంటూ సిపిఐ నారాయణ ప్రకాశం జిల్లా ఒంగోలులోని సిపిఐ రాష్ట్ర మహాసభల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ఈయన చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం సృష్టించడంతో చాలామంది పవర్స్టార్ అభిమానులు సిపిఐ నారాయణ పై మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: