పవన్ కళ్యాణ్ హీరోగా ఎంతో పేరు తెచ్చుకొని, ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. జనసేన పార్టీ పెట్టి  తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కొన్ని సంవత్సరాల పాటు కృషి చేశారు. చివరికి ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డారు. అలాంటి పవన్ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ, టిడిపి తో పొత్తు పెట్టుకుని  అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా పవన్ కు బీజేపీతో మంచి బంధముంది. హిందుత్వ నినాదంపై ఇప్పటికీ పోరాడుతూనే ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ తాజాగా చేసినటువంటి ఒక పని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైంది.. దీంతో చాలామంది నెటిజన్లు పవన్ తన పంథాను మార్చుకున్నారా.. బీజేపీ లైన్ విడిచి పెట్టారా అంటూ చాలామంది అడుగుతున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక అభిమాని ఒక జెండాను తీసుకువస్తే పవన్ కళ్యాణ్ దాన్ని మెడలో వేసుకున్నాడు అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ జెండా టీవీకే పార్టీకి సంబంధించింది అంటూ చాలామంది అనుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఆయన బిజెపిని వ్యతిరేకిస్తున్నటువంటి విజయ్ దళపతి  పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు. అంతేకాదు బీజేపీకి  పవన్ కళ్యాణ్ హ్యాండిచ్చారా.. ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం పాట పాడతారా? ఒక లైన్ అంటూ ఉండదా? అంటూ కామెంట్లు పెడుతున్నారు..
 అయితే సోషల్ మీడియాలో ఇంతటి రాద్ధాంతం కావడానికి కారణం ఆయన మెడలో వేసుకున్న  కండువే.. అయితే ఆ కండువాను క్లియర్ గా గమనిస్తే అది తమిళనాడుకు చెందినటువంటి  ఒక అభిమాని ఆయన మెడలో వేశారు. అయితే ఈ ఫ్లాగ్ ని చూసి అందరూ టీవీకే జెండా అనుకున్నారు.. కానీ అది  కర్ణాటక రాష్ట్రానికి చెందిన జెండా అని  నిర్ధారించారు.. ఈ విధంగా అది ఏ జెండానో తెలియకుండా సోషల్ మీడియాలో విపరీతంగా పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేశారని ఆయన అభిమానులు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: